ప్రపంచ ప్రఖ్యాత ‘బిగ్ బాస్‘ షో తెలుగులో మొదలయి మూడు సంవత్సరాలు దాటిపోయింది. గత మూడు సీజన్లను విజయవంతంగా కొనసాగిన ఈ షో నాలుగో సీజన్ మరో ఐదు రోజుల్లో మొదలు కాబోతుంది. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కు నాని, మూడవ సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్ట్లు గా వ్యవహరించారు. ఇక నాలుగో సీజన్ కు కూడా నిర్వాహకులు నాగార్జున కే మొగ్గు చూపారు.
ఈ దశలో ఈ మధ్యనే కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే కరోనా నేపథ్యంలో వీరందరికీ 14 రోజుల క్వారంటైన్ ప్రక్రియను కూడా చేపట్టారు. ఇక ఇప్పటికే ఎంతో మంది కమెడియన్లు, యాంకర్లు, టిక్ టాక్ స్టార్స్ సోషల్ మీడియా సెలబ్రిటీలతో ఈ లిస్టు నిండిపోయింది. ఇదే సమయంలో ఈ లిస్టులో సినీ గ్లామర్ తక్కువైంది అని అందరూ అనుకుంటున్నారు.
దీంతో బిగ్ బాస్ నిర్వాహకుల టీం బాగా ఆలోచించి చివరిలో ఒక ముద్దుగుమ్మని రంగంలోకి దింపారు. ఆమే మోనాల్ గజ్జర్. అల్లరి నరేష్ తో ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’, ‘సుడిగాడు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మోనాల్ ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
అహ్మదాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు షోలో లేని సినీ గ్లామర్ ను పెంచేందుకు వచ్చేసిందన్నమాట. హౌస్ లో ఇకపై తన ప్రయాణం ఎలా సాగుతుంది అన్నది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. మొత్తానికి నిర్వాహకులు చాలా తెలివిగా హౌస్ లో సినీ గ్లామర్ లేని లోటుని మోనాల్ గజ్జర్ లాంటి అందమైన యాక్టివ్ పర్సనాలిటీతో తీర్చేచేశారు.