బిగ్‌బాస్ ఇంటిలో తన గేమ్ ఎలా ఆడినప్పటికీ అభిజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గట్లేదు. ఎప్పుడూ కూల్ గా ఉండడం, అది ఎంత టెన్షన్ అయినా సింపుల్ గా ట్రీట్ చేసే విధానాన్ని జనాలు బాగా ఇష్టపడుతున్నారు. అటు ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు కూడా అతనిని ఇష్టపడుతున్నారు అంటే అతని క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా అఖిల్ సోదరుడు తనన తోబుట్టువుని కాదని అభిజిత్ ని పొగడడం చాలా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. మొన్న ఇంటిలోకి వచ్చి అరియానా ఫ్రెండ్ కూడా అభిజిత్ కు పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. శనివారం ఎపిసోడ్ లో అఖిల్ సోదరుడు కూడా అభిజిత్ గురించి పాజిటివ్‌గా స్పందించాడు. నేను నీకు పెద్ద ఫ్యాన్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు.
ఇక దానికి అభిజిత్ అతనికి ఆప్యాయంగా సమాధానం ఇవ్వడమే కాకుండా…. లేచి నిలబడి దండం పెట్టి సారీ భయ్యా..! నేను మీ వాడితో రోజూ కొట్లాడుతున్నాను…. నన్ను క్షమించండి అంటూ ఆన్సర్ ఇచ్చాడు. అఖిల్ సోదరుడు కూడా ఇది గేమ్ లో భాగం మాత్రమే….. ఆ హీట్ లో ఎలా ఉంటారో మాకు తెలుసు…. అలాంటివి మనసులో పెట్టుకోకు అంటూ చాలా కూల్ గా సపోర్ట్ చేశాడు. అఖిల్ సైలెంట్ అయిపోయాడు…. అఖిల్ హీరో అయ్యాడు..!