దాదాపు మూడు నెలలకు పైగా జరిగిన బిగ్ బాస్ షోలో అభిజిత్, అఖిల్, మోనాల్, హారిక ల టాపిక్ లేకుండా జరిగిన ఒక్క ఎపిసోడ్ కూడా ఉండదు. ఈ నలుగురు మధ్య చిగురించిన ప్రేమ షో కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇక అవినాష్, అరియానా కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అయితే ఇందులో మాత్రం గత కొన్ని రోజులుగా హారిక వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.
మొదటి నుండి అభిజిత్ పైన బాగా అభిమానం చూపించిన హారిక ఈమధ్య రూటు మార్చింది. అఖిల్ పైన పడిపోతోంది. అతను కూడా సమయానికి అవసరమైనట్లు ముద్దులు, కౌగిలింతలు అంటూ వెంట పడుతూనే ఉన్నాడు. అభిజిత్ హారిక మధ్య రెండు వారాల ముందు దూరం పెరిగింది ఈ సమయంలోనే నాగార్జున ఆమెకు క్లాస్ పీకాడు. దాంతో అభిజిత్ కు దూరమై అఖిల్ కు దగ్గర అయింది.
అయితే ఇందులో హారిక ఉద్దేశం ఏమిటన్నది ఇప్పటి వరకూ అందరికీ డౌట్ ఉన్నది . అఖిల్ తనతో ఫ్లెర్ట్ చేయడం ప్రారంభించిన తర్వాత తను ఫ్లెర్టింగ్ టార్ట్ చేశాను అని చెప్పిన హారిక మీరు మాత్రమే కాదు మేము కూడా చేయగలనమని చెప్పేందుకే ఇలా చేశానంటూ హారిక తెలిపింది.
అందుకే ఇన్ని రోజులు అఖిల్‌తో క్లోజ్ గా ఉన్నట్లు చెప్పకనే చెప్పేసింది. అభి వల్ల తనకు పోసేసివ్ క్వాలిటీ ఉందని తెలిసిందంటూ హారిక చెప్పింది. తన బెస్ట్ ఫ్రెండ్ అంటే తన తోనే ఉండాలని అనుకుంటే… కానీ అతను అందరితో బాగా మాట్లాడే వాడిని ఈ సమయంలో తనకు పోసేసివ్ అనిపించిందని హారిక అసలు విషయాన్ని బయట పెట్టింది.