12వ వారం నామినేషన్ ప్రక్రియ లో ఇంటిలో ప్రకంపనలు చెలరేగాయి. తాజాగా నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే ఇంటిలో గంభీర వాతావరణం నెలకొందని స్పష్టమైంది. నామినేషన్ ప్రక్రియ లో అఖిల్-మోనాల్-అభిజిత్ మధ్య జరిగిన డ్రామాతో ఒక్కసారిగా హౌస్ అంతా సీరియస్ అయిపోయింది. ఇందులో ఒకరు మరొకరిని ఓర్చుకుంటూ కనిపించారు.
ఈ సమయంలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు కూడా వినవచ్చు. హారికతో మోనాల్ మాట్లాడుతూ అఖిల్ నన్ను అపార్థం చేసుకున్నాడు అని ఏడ్చింది. కెప్టెన్సీ టాస్క్ నుండి ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేయడం లేదు నువ్వు మాట ఇచ్చి తప్పావు అని అఖిల్ ఆమె ఒఐ చేసిన వ్యాఖ్యలపై మోనాల్ చాలా బాధపడింది. తీవ్ర దిగ్భ్రాంతి లో ఉన్న మోనాల్ ను హారిక ఓదార్చిచ్చింది.
ఆ సమయంలో అఖిల్ చాలా పాజిటివ్, జెన్యూన్, అఖిల్ సూపర్ కానీ అతడికి ఇప్పుడు ఏమైందో అర్థం కావడం లేదంటూ హారిక తో మోనాల్ తో చెప్పుకొని వచ్చింది. ఇక ఎపిసోడ్ లో ఎమోషనల్ అంశాలు ఉన్నాయి కానీ నీది ఆట నీది నా ఆట నాది అని మోనాల్ ముఖం పైన చెప్పింది. అయితే ఇక్కడ ఈ విషయంలో మోనాల్ తప్పు ఏమీ లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ముందు నుండి అఖిల్ నీడలో మోనాల్ బ్రతుకుతుంది అన్నత్లు…. అలాగే ఆమె నెట్టుకొస్తోంది అని విమర్శలు ఉన్నాయి. వాటికి చెక్ పెట్టే విధంగా మోనాల్ వ్యవహరించడం ఆమెకు ఎంతో ఉపయోగం… అఖిల్ కు దీనివల్ల వచ్చే నష్టం లేదు…. ఒక వ్యక్తిపై ఆధారపడి గేమ్ ఆడటం అనేది అఖిల్ తప్పు అని అభిప్రాయపడుతున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!