బిగ్బాస్ ఇంట్లోకి అసలేం అంచనాలు లేకుండా తన ప్రయాణం మొదలుపెట్టిన అఖిల్ చివరికి ఫైనలిస్తుల జాబితాలో ఉంటాడని చాలామంది ఊహించలేదు. అయితే అతడు ఇంటిలో తనకు నచ్చిన వాళ్ళ పై కురిపించిన ప్రేమ…. ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు వల్లే బాగా పాపులర్ అయ్యాడు. సీరియల్స్ లో, షార్ట్ ఫిలిమ్స్ లో సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ వల్ల వచ్చింది. విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అఖిల్ బిగ్ బాస్ ఇంటిలో ఆర్థికంగా మిగతా వారితో పోలిస్తే చాలా నష్టపోయాడు అని అందరూ అంటున్నారు. మరి అసలు అఖిల్ కు దక్కిన రెమ్యునరేషన్ వివరాలు తెలిస్తే షాక్ కు గురి కావాల్సిందే.
ఫిజికల్ టాస్క్ లో తనదైన శైలిలో అందరితో పోటీ పడుతూ ఉండే అఖిల్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు పొందాడు. ఎన్నో సందర్భాల్లో తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఇదే సమయంలో అతను ఫ్రెండ్ షిప్ కు ఇచ్చే విలువ కూడా చాలామందికి నచ్చింది. మోనాల్ తో నడిపే లవ్ ట్రాక్, ఆమెపై చూపించే కేరింగ్ అతనికి భయంకరమైన లేడీస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇక ఆమెతోనే హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయిన అఖిల్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉండేవాడు.
అయితే ఫైనల్లిస్టులో బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా అఖిల్ రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. సోహెల్ ఫైనల్లిస్ట్ నుండి తప్పించుకోవడానికి 25 లక్షల ఆఫర్ అంగీకరించడంతో అఖిల్ రెండవ స్థానానికి చేరుకున్నాడు. అయితే అతను విన్నర్ కాలేకపోవడం వల్ల చిల్లిగవ్వ కూడా దక్కలేదని అందరూ జాలి పడ్డారు.
ఇక అతని రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఇందులో 105 రోజులు కొనసాగిన అఖిల్…. రోజుకు 25 వేల రూపాయల లెక్కన తీసుకున్న విషయం తెలిసిందే. ఇక మొత్తం షోలో పాల్గొన్నందుకు అతనికి 26 లక్షల 25 వేలు రెమ్యూనరేషన్ అందుకున్నాడని సమాచారం. కానీ సోహెల్ కు కూడా అదే రెమ్యునరేషన్ అయినప్పటికీ అతనికి వచ్చిన 25 లక్షల తో కలిపి… సోహెల్ 51 లక్షల రూపాయల వరకు సంపాదించాడు. ఇక అఖిల్ నష్టపోయాడా… లాభపడ్డాడా అన్నది అతని ఫీలింగ్ పైన ఆధారపడి ఉంటుంది.