బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న అఖిల్ కు బలహీనతలు ఉంటాయి. మొదటినుండి ఆ బలహీనతల పైన కొడుతూ అభిజిత్ లబ్ధి పొందుతూ ఉన్నాడు. ముందుగా మోనాల్ విషయంలో అఖిల్ కు పోటీ వచ్చాడు. కానీ ఎప్పుడైతే మోనాల్ కి బయట నెగటివిటీ ఉందని గ్రహించాడో వెంటనే ఆమెకు చివాట్లు పెట్టి దూరం చేశాడు.
తర్వాత ప్రతి విషయంలో అఖిల్ తో పోటీ పడుతూ వాదనలకు దిగాడు. అభి శాంతంగా మాట్లాడుతుంటే అఖిల్ మాత్రం కోప్పడుతూ వచ్చాడు. అఖిల్ ఫాలోయింగ్ అఖిల్ కి ఉంది అనుకోండి అయితే బిగ్ బాస్ పెట్టిన కెప్టెన్సీ టాస్క్ విషయంలో మెహబూబ్ తో పంతానికి పోయి చివరికి ఇంటి సభ్యుల మధ్యన కాకుండా ప్రేక్షకుల ముందు కూడా చెడు అయ్యాడు. మెహబూబ్ అఖిల్ లలో ఒకరు కెప్టెన్సీ కోసం త్యాగం చేయవలసి ఉంది. ఇక చివరికి విజేతగా నిలిచిన వారికి ఇమ్యూనిటీ కూడా లభించే అవకాశం ఉందని బిగ్బాస్ చెప్పారు.
అయితే సోహెల్ వీరిరువురి కోసం దానిని త్యాగం చేశాడు కానీ వీరిద్దరూ మాత్రం పంతానికి పోయారు. అయితే ఈ క్రమంలో బిగ్బాస్ వీరిద్దరిలో ఎవరు త్యాగం చేయక పోయేసరికి పూర్తిగా టాస్క్ రద్దు చేయవలసి వచ్చింది. ఇలాంటి సమయంలో సోహెల్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఇద్దరిని ఉద్దేశించి మొత్తం చెడ కొట్టుకున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అఖిల్ మీరిద్దరూ కలిసి ఆడారు తప్ప నా కోసం ఎవరైనా ఎప్పుడైనా ఒక హెల్ప్ అయినా చేశారా…? ఇంటిలో ఇప్పటివరకు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు అని అన్నాడు.
బిగ్బాస్ ఇంట్లో ఎవరి గేమ్ వారు ఆడటం ప్రధానం అని నాగార్జున ఎప్పటినుండో చెబుతున్నాడు. అదే రూల్ కూడా. కానీ నాకు సహకరించండి నా కోసం మీరు కష్టపడండి అన్నట్లు అఖిల్ మాట్లాడడం ప్రేక్షకులకు సరిగా నచ్చలేదు. అఖిల్ పై ఇందులో అనేక కామెంట్లు వస్తున్నాయి. ఇక ఈ లోపల అతను సీక్రెట్ రూమ్ కి కూడా వెళ్ళిపోతాడు. తర్వాత అఖిల్ భవిష్యత్తు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు..!