బిగ్బాస్ ఇంటిలో టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి కొనసాగింది కొద్ది రోజులు అయినా ఉన్న కొన్ని రోజులు తన మార్క్ క్రియేట్ చేసింది. అయితే ముందు నుండి ఆమె పైన ప్రేక్షకులకు నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది కాబట్టి ఎంత మంచిగా ఆటాడినా, నిజాయితీగా, ముక్కుసూటిగా ఉన్నప్పటికీ ఆమె బయటకు రావలసి వచ్చింది.
అందుకే ఆమె మూడో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది ఇక అదే యాంకర్ ప్రొఫెషన్ కు చెందిన అరీయానా, దేవి బాగా క్లోజ్ అయ్యారు. ఒకానొక సందర్భంలో ఈసారి మహిళలే విజేత కావాలి మన ఇద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ కొట్టాలని ముచ్చట్లు పెట్టుకున్నారు. కానీ అదే రోజున దేవి నాగవల్లి ఎలిమినేట్ అయింది. అరీయానా కూడా తీవ్రంగా ఏడ్చేసింది.
ఇక అరీయానా నామినేషన్ లో ఉన్న ప్రతి సారి దేవి నాగవల్లి మద్దతు ఇస్తూనే ఉంది. తనకు ఓటు వేయండి అంటూ ఆమెకు అండగా నిలబడుతూ వచ్చింది. ఇక ఈ మధ్య నెటిజన్లు అతికి మారుపేరుగా అరీయానా మారిందని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో దేవి నాగవల్లి మళ్ళీ అరీయానా మద్దతు పలికింది.
మీరు అతి చూశారు నేను నిజాయితీ చూశాను అంటూ పోస్ట్ చేసింది. ఆమెకు ఓటు వేసి గెలిపించండి అని కోరింది. దేవీ మాటలను మరి ఎంతమంది పట్టించుకుంటారు… ఫైనల్ లో అరీయానా ను నిలబెట్టిన వారు ఆమె టైటిల్ గెలిచేలాగా ఎంత వరకు సహకరిస్తారో వేచి చూడాలి.