బిగ్బాస్ ఇంటిలో తమ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించుకుని కంటెస్టెంట్ లు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫైనలిస్టులు అందరికీ ఘనంగా స్వాగతం లభించింది. ఇక అమ్మాయిలలో కంటెస్టెంట్ అయిన బోల్డ్ బేబీ అరియనా కు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఘనంగా స్వాగతం తెలిపారు.
20వ తేదీ గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న అరియానా కు ఊహించని స్పందన లభించింది. అరియానా ఇంటికి రాగానే కింద మీద ఊపు అరియానా తోపు.. అరియానా కి జై బోలో గుంతలకిడి గుల గుల గుల అంటూ నినాదాలు చేశారు. తనకు అంత ఘనంగా స్వాగతం చెప్పినందుకు ఆమె ఆనందంలో మునిగిపోయింది.
ఇంటికి చేరుకోగానే అరియానా ఎమోషనల్ అయిపోయింది. ఇంటి సభ్యులందరూ నామినేట్ చేయడంతో ఆమె ఒత్తిడికి గురి అయినట్లు అప్పుడు అవినాష్ తనకు బాగా సపోర్ట్ చేశాడు అని చెప్పింది. ఈ సందర్భంగా అవినాష్ ను పార్టీ కి గెస్ట్ గా పిలిచారు. ఇక అవినాష్ తో ఆమె స్నేహితులు కూడా పాల్గొన్నారు. కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా అరియానా చాలా కూల్ అని అవినాష్ అనగానే అరియానా ఆశ్చర్యముగా ‘ సీరియస్లీ’ అంటే… అందరూ కేరింతలతో మునిగిపోయారు..