తెలుగు బుల్లి చరిత్రలో అతి కొద్దికాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన షో ల లిస్ట్ తీస్తే జబర్దస్త్ ముందు వరుసలో ఉంటుంది. ఏకంగా 8 ఏళ్ల నుండి తన హవా చూపిస్తూ దూసుకుపోతున్న ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. చిత్రాల్లో కూడా మంచి ఆఫర్లు పొంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
అయితే ముక్కు అవినాష్ మాత్రం అనూహ్య పరిస్థితుల్లో జబర్దస్త్ వదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది. అయితే అవినాష్ జబర్దస్త్ షో సీక్రెట్ ఒకటి రివీల్ చేశాడు. కొంతమంది ఆ షో మానివేయడం వెనుక కారణం కూడా చెప్పాడు. బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న అవినాష్ క్రమంగా సినిమా ఆఫర్లు కూడా అందుకోవడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో వరుస ఇంటర్వ్యూలతో తో బిజీ అయిపోయాడు.
ఇక తాజాగా జబర్దస్త్ లో కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. వేరే ఛానల్ లో కామెడీ షో లు చేస్తున్నారు అంతేకాకుండా జబర్దస్త్ నియమ నిబంధనల ప్రకారం షో లో కి వెళ్ళినప్పుడు అగ్రీమెంట్ తీసుకుంటారని అందుకు అనుగుణంగా వ్యవహరించాలని అవినాష్ చెప్పాడు. జబర్దస్త్ వాళ్ళకు అగ్రీమెంట్ లో సంతకం పెట్టి ఉంటే వేరే కామెడీ షో కి వెళ్ళ కూడదు అని ఉంటుంది.
అలా కాదని వెళ్తే మాత్రం నిర్ణీత మొత్తం చెల్లించాల్సిందే… ఇక ఆ షో నుండి వదిలి వెళ్లిన వారంతా అలా డబ్బులు కట్టి వెళ్లారు…. నేను కూడా పది లక్షలు కట్టాను. రీ ఎంట్రీ అనేది మాత్రం నా చేతుల్లో లేదు…. వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా అని అవినాష్ వివరించాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?