బిగ్ బాస్ 4 : మోనాల్ ని అడిగి మరీ పరువు తీయించుకున్న అవినాష్

బిగ్బాస్ ఇంటిలో లో లవ్ స్టోరీ ల జోరు చివరి దశకు వచ్చినప్పటికీ తగ్గినట్లు కనిపించట్లేదు. మోనాల్ ఏమో… నా గేమ్ నేను ఆడుకుంటా… నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా ఫ్యామిలీ కోసం ఆడుతున్నాను అని ఆమె చెప్పుకుంటోంది కానీ వెంటనే అఖిల్తో క్లోజ్ గా జరుగుతుంది. దీని వల్ల మోనాల్ గేమ్ చెడిపోతుందని చెబుతున్నా ఆమె మళ్ళీ మళ్ళీ అఖిల్ వద్దకే వెళుతుంది.

 

ఇదంతా పక్కన పెడితే అవినాష్ విషయం కూడా ఇప్పుడు కొద్దికొద్దిగా హైలైట్ అవుతుంది. అవినాష్ మోనాల్ మీద చేతులేసుకుని గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చాడు. అఖిల్ టాస్క్ లో పాల్గొంటే అది అతని పడాలని కాస్త ఎక్కువ చేశాడు. అఖిల్ వెంటనే అవినాష్ కు పంచ్ వేశాడు. అందుకు అఖిల్…. మోనాల్ తో అతను మీ తమ్ముడా అని అడిగాడు. దీంతో అవినాష్ మోనాల్ తో చర్చించాడు. నేను నీకు అన్నా..? లేకపోతే అవినాషా అని అడిగేశాడు. మోనాల్ వెంటనే ‘అవినాష్ అన్న’ అని గాలి తీసేసిం. పిలిచి మరీ పరువు తీసుకోవడం అంటే ఇదే అని అవినాష్ నోరు మూసుకున్నాడు.

నిన్న రాత్రి ముద్దు పెట్టడంతో అవినాష్ ఏదైనా ఫీల్ అయి ఉంటాడు కానీ వెంటనే ఆమె అలా అనేసరికి బాగా హర్ట్ అయి పోయాడు. ఇక అఖిల్, సోహెల్ చివరి లెవెల్ టాస్క్ కోసం ఉయ్యాలలో కూర్చున్నారు. ఎవరైతే ముందు ఉయ్యాలలో నుండి కిందకు దిగుతారో వారు అవుట్ అయిపోయినట్లు. మిగిలిన విజేత నేరుగా గ్రాండ్ ఫినాలే కు అర్హత సాధిస్తాడు. బిగ్బాస్ వారిని ఉయ్యాల నుండి లేపడానికి అదే పనిగా టాస్క్ లో జ్యూస్లను పంపిస్తున్నాడు,

కనీసం టాయిలెట్ కి అయినా కూడా ఉయ్యాల నుండి దిగకూడదు మరి. మిగతా కంటెస్టెంట్ లు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారన్న విషయం ఆసక్తిగా ఉంది…. అది తెలుసుకోవాలంటే ఈరోజుటి ఎపిసోడ్ చూడాల్సిందే..!