బిగ్ బాస్ షో 14వ వారం చాలా విచిత్రంగా గడుస్తోంది. సోహెల్, అరియానా ఒక రకంగా గొడవపడి కోపావేశాలకు పోతే అభిజిత్ మరోసారి హర్ట్ అయ్యాడు. అఖిల్, మోనాల్ సంగతి ఇప్పటికీ అర్థం కాదు. హారిక మాత్రం కొత్త స్నేహాలను పెంచుకుంటోంది. ప్రజల ఓట్లు వేయమని అభ్యర్ధించుకునే అవకాశం కోసం మాత్రం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు.
రాజా రాణి టాస్క్ లో ఎంటర్టైన్ చేయాలని బిగ్‌బాస్ సూచించారు. అందరికన్నా అరియనా బాగా చేసిందని అభిజిత్ తో పాటు ఎక్కువ మంది ఓట్లు వేశారు. అరియానా ఎక్కువ ఓట్లు పడే సరికి ఓట్ల కోసం అప్పీల్ చేసుకునేందుకు ఆడియన్స్‌తో నేరుగా మాట్లాడే మొదటి చాన్స్ వచ్చింది. ఇక రెండవ సారి ఓపిక ఎక్కువ టాస్క్ అని ఇచ్చాడు బిగ్‌బాస్. అందరికన్నా ఎక్కువగా ఉండి సోహెల్ ఆల్ విజేతగా నిలిచాడు. కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి ప్రజలకు ఓట్లకు అప్పీల్ చేసుకొని బిగ్ బాస్ తో తన బాధంతా వివరించాడు.
ఏకాగ్రత విషయంలో అరియానా అందరికంటే ముందుగా నిలిచింది. 30 నిమిషాలకు ఊహించి లెక్కించడంలో అరియానా మిగతా వారితో పోలిస్తే బెటర్ టైమింగ్ ను అందుకుంది. ఇలా రెండవసారి ఆమెకు ఓట్ల కోసం అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఈరోజుటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు నాన్ స్టాప్ డ్యాన్స్ ఇచ్చారు. ఎవరైతే స్టేజీపైన ఆగకుండా పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉంటారో వాళ్లకు గోల్డ్ మైక్ లభిస్తుంది.
ఇక్కడ ఎవరి ఫిట్నెస్ ఎంత అన్న విషయం బయటపడుతుంది అసలే అభిజిత్ కు సరిగ్గా డ్యాన్స్ రాదు. ఇక ఈ రోజు ఇవ్వనున్న టాస్క్ అతనికి అగ్ని పరీక్ష లాంటిది. అభిజిత్ సోహెల్ వంటివారితో అసలు పోటీ పడలేదు. ఇక ఈ టాస్క్ లో చివరి వరకు హారిక, మోనాల్ ఉంటారని… మోనాల్ కోసం హారిక త్యాగం చేయనుందని సమాచారం బయటకు వచ్చింది.