తెలుగులో చాలా ఏళ్ళ క్రితం హీరోయిన్ గా పరిచయమైన గుజరాతి బ్యూటీ మోనాల్ గజ్జర్ ఒక ఐదు సినిమాలు చేసి భారీ బ్రేక్ తీసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ షో ద్వారా అడుగుపెట్టి మరింత పాపులారిటీ సంపాదించింది ఇలాంటి పరిస్థితుల్లో తన జీవితానికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
బిగ్ బాస్ లో అఖిల్ తో ఎంతో చనువుగా ఉన్న మోనాల్… వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్నట్లే వ్యవహరించింది. ఇక ఈమె సరిగా గేమ్ ఆడకపోయినా లవ్ ట్రాక్ మాత్రం బాగానే నడిపింది మొత్తానికి అనుకున్నదానికన్నా ఎక్కువ రోజులు బిగ్ బాస్ ఇంట్లో కొనసాగి విమర్శల పాలైంది. బయటికి వచ్చిన తర్వాత వరుసగా ఆఫర్లు అందుకని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఒక డ్యాన్స్ షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.
ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా అల్లు అదుర్స్ లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఇక రెండు రోజుల క్రితం ఆమె అహ్మదాబాద్ వెళ్ళిపోయింది. తన ప్రయాణానికి సంబంధించిన విశేషాలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇదే క్రమంలో తన ప్రేమ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాను అని అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో మలయాళ పరిశ్రమ కు చెందిన ఒక వ్యక్తిని ప్రేమించిన అతను మోసం చేయడంతో దక్షిణాదిని వదిలేసింది.
చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అవుతుందట ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. దాని కోసమే గుజరాత్ వెళ్ళింది. వెంటనే మళ్లీ ఇక్కడికి వచ్చేస్తుంది. అయితే చేతిలో ఆఫర్లు పక్కన అఖిల్ ఉన్నప్పుడు ఇక హైదరాబాద్ వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.