బిగ్బాస్ ఇంటిలో చివరి వారానికి షో వచ్చేసింది. అఖిల్, అభిజిత్, హారిక, సోహెల్, అరియానా ఫైనలిస్టు లుగా మిగిలారు. ఎన్నో అవాంతరాలు దాటుకుని నానా పాట్లు పడి అందరూ ఈ స్థాయికి వచ్చారు. అయితే ఇక్కడి నుండి ఒక టైటిల్ ఎవరో ఒకరే తీసుకొని వెళ్ళగలరు. మరి చీఫ్ గెస్ట్ దగ్గర ఆ టైటిల్ ఎవరు తీసుకుంటారు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి పెరిగిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో బిగ్బాస్ ఇంటి సభ్యుల మధ్య గొడవ పెట్టేందుకు పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో గెలవడానికి ఎవరు అనర్హం అన్న విషయంపై సభ్యులందరూ నిర్ణయించుకోవాలని ఆదేశించాడ. అయితే ఇక్కడ అందరూ అనుకున్నట్లే జవాబు ఇచ్చారు కానీ అభిజిత్ మాత్రం విచిత్రంగా హారిక పేరు తీసుకుని వచ్చాడు.
మొదటినుండి హారిక, అభిజిత్ మంచి కెమిస్ట్రీ ఉంది. అభి కి కూడా హారిక అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు కౌగిలించుకుంటూ ప్రేమను కురిపిస్తూ ఉంటాడు. అలాంటి హారిక మిగతా వారితో పోలిస్తే కొంచెం తక్కువ అని మాట్లాడడం ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఈ రోజు విడుదలైన ప్రోమో లో అభి హారిక ను నువ్వు టైటిల్ గెలవడానికి అర్హురాలువి కాదు అని చెప్పడంతో హారిక తో పాటు మిగతా వారు కూడా షాక్ అయ్యారు.
మనం గమనించినట్లైతే అంతకు ముందు వారం హారిక అభిజిత్ ను ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు నామినేట్ చేసింది. అది కూడా బిగ్ బాస్ చలవే. మరి ఎంతో సక్సెస్ఫుల్గా వీరిద్దరి మధ్య చిచ్చు రేపిన బిగ్బాస్ ఇదే ఫైర్ మరో 6 రోజులు ఇలాగే కొనసాగిస్తే షో కి చాలా ఉపయోగపడుతుంది. ఓటింగ్ సిస్టం కూడా తారుమారు అవుతుంది.