బిగ్ బాస్ నాలుగో సీజన్ 14వ వారం లో షో పైన ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఇక వాటన్నిటినీ అధిగమించేందుకు చివరివారం ఫైనల్స్ గ్రాండ్గా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంటిలో ఇన్ని రోజులు అవసరం లేని కంటెస్టెంట్స్ ను కొనసాగిస్తున్నారు అన్న విమర్శలు మాత్రం అలానే ఉన్నాయి. ఇక ఈసారైనా ఎలిమినేషన్ విషయంలో న్యాయం జరుగుతుందా లేదా చివరి నిమిషంలో ట్విస్ట్ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎపిసోడ్ ప్రోమో మరింత హైప్ క్రియేట్ చేసింది ఈ సీజన్ మొత్తం లో అతి తక్కువ ఓట్లు సాధించిన కంటెస్టెంట్ల లిస్ట్ తీస్తే అందులో మోనాల్ పేరు కచ్చితంగా ఉంటుందని సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాంటి కంటెస్టెంట్ ఇన్నిరోజులు ఇంటిలో కొనసాగడమే పెద్ద మిస్టరీ. ఇక ఈ వారం కచ్చితంగా ఆమె వెళ్లి పోతుంది అని ఫిక్స్ అయ్యారు కానీ హారిక కూడా వెళ్లిపోవచ్చని మొదట్లో ప్రచారాలు గట్టిగా సాగాయి. ఇక ఈ రోజు రిలీజ్ చేసిన లో అరియానా కూడా డేంజర్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రింటింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎలిమినేషన్ విషయంపై క్లారిటీ ఇవ్వబోతున్నారు. చివరికి అరియానా, మోనాల్ ఇద్దరిలో ఫైనలిస్ట్ కి సంబంధించిన ఫోటో వస్తుందని రానివారు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెమటలు పట్టించాడు. ఇక ఈ ఫోటో అరియానా దే ఈ పూర్తిగా అర్థం అయిపోయింది. కావాలనే విమర్శలను తగ్గించేందుకు అరియానా ఫోటో కనిపించే లాగా ఫైనలిస్ట్ ను ప్రోమో లో నే ప్రకటించారని లేకపోతే ఇక ఈ షో పైన వచ్చే విమర్శలు తట్టుకోవడం కష్టమని నిర్వాహకులు భావించినట్లు చెబుతున్నారు
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!