బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదలైనప్పుడు ఈ షో భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకోవడం కష్టం అని చాలామంది అన్నారు. కంటెస్టెంట్ లు పెద్దగా పేరు లేని వారిని తీసుకుని వచ్చారని ఈసారి ఫ్లాప్ అవుతుందని అంచనా వేశారు. అయితే నెమ్మదిగా కంటెస్టెంట్ లు అంతా సెలబ్రిటీల గా మారడంతో ఒక వర్గం ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది ముఖ్యంగా అభిజిత్ షో ను నడిపించాడు అనే చెప్పాలి. సోహెల్ కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే శనివారం ఎపిసోడ్ దగ్గరికి వచ్చేసరికి అరియనా ను అందరూ టార్గెట్ చేసినట్లు అనిపించింది. నాగార్జున కూడా ఆమెకు కౌంటర్ లు ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ కొద్దిసేపటికి పాజిటివ్ గా మాట్లాడాడు అనుకోండి అయితే సోహెల్ కు అతను ఫేవర్ చేసినట్లు అనిపించింది. ఇలా ఎన్నో విషయాల్లో పక్షపాతం చూపించారు అని విమర్శలు మొదటి నుండి వస్తూనే ఉన్నాయి.
అయితే ఈ వారం బిగ్ బాస్ పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు. రోజుకి 16 గంటలకు పైగా అంతా మేల్కొనే ఉంటారు. ఒక గంట ఎంటర్టైన్మెంట్ కరువు అవ్వడం నిజంగా దారుణం అని చెప్పాలి. రెండు రోజులుగా జరిగిన సోహెల్-అరియనా గొడవ ఈ వారం హైలెట్ అయింది తప్ప ఇంక ఏమీ లేదు.
ఇక తొలి ఫైనలిస్ట్ గా ఎంపికైన సోహెల్ కు గొడవలు బాగానే ఉపయోగపడ్డాయి. అయితే సింపతీ కార్డు అరియనా వైపు మొగ్గు చూపుతుంది అనుకుంటే సోహెల్ హైలెట్ అయిపోయాడు. అఖిల్ తో కూడా గొడవ పడ్డాడు. సోహెల్ ఇలా సరైన సమయంలో కోపం బయటకు తీసాడు…. అది చూపించడం లో తప్పులేదని నాగార్జున అన్నాడు.
ఇంకా అభిజిత్ టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న సమయంలో అఖిల్ నుండి అతనికి బాగా కాంపిటీషన్ ఉంది. అటు సోహెల్ కూడా బలంగా తయారయ్యాడు. అయితే అభికి కేవలం ఓట్లు వస్తే సరిపోదు అని మిగిలిన వారం రోజుల్లో అతను మరింత బలంగా మారాలని కామెంట్స్ వస్తున్నాయి అతనికి వీరిద్దరి నుండి అభికు పెద్ద ముప్పు పొంచి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.