బిగ్బాస్ ఇంటిలోకి ఒకసారి వెళ్లి వచ్చిన వారికి అక్కడి పరిస్థితులు బాగా తెలుసు. అసలు కంటెస్టెంట్ లు ఎలా ప్రవర్తిస్తున్నారు అందుకు కారణం ఏంటి అన్న విషయంపై ఒక అంచనా వేయగలరు. అలాగే మొదటి సీజన్లో మంచి ఎంటర్టైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న ధన్ రాజ్ ఈ సీజన్ పై తన అభిప్రాయాన్ని చెప్పాడు. దీపావళి సందర్భంగా అలీ తో జరిగిన ఇంటర్వ్యూలో ధన్ రాజ్, గంగవ్వ, అమ్మా రాజశేఖర్ లు పాల్గొన్నారు.
ఒక మీడియా ఛానల్ లో ప్రసారమైన ఈ ఇంటర్వ్యూలో అతను చాలా విషయాలు పంచుకున్నాడు. సీజన్ మొదటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను అని చెప్పిన ధన్ రాజ్ మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అభిజిత్ ఒకే లాగా ఉన్నాడని అతనిలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదని చెప్పడం విశేషం. మాకు అభిజిత్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు అతడే నా ఫేవరెట్ కంటెస్టెంట్ అన్నాడు.
ఇక అభి గురించి చెప్పిన తర్వాత తన తోటి కమెడియన్ అయిన అవినాష్ బిగ్బాస్ కోసం వేరే శో వదిలిపెట్టి వెళ్ళాడు అని గుర్తు చేశాడు. అతను కూడా నాకు స్నేహితుడు కానీ నాకు అభిజిత్ అంటే ఇష్టమని చెప్పాడు. ఎందుకో అవినాష్ ఈమధ్య తనలోని కొత్త కోణాన్ని బయటపెడుతున్నాడని…. అతనిలో కోపం, నవ్వడం, నవ్వించడం అన్ని బయటకు వస్తున్నాయి అని అన్నాడు. ఇప్పుడిప్పుడే అతనిలో మార్పులు రావడం తాను గమనిస్తున్నాను అని ధన్ రాజ్ చెప్పుకొచ్చాడు.
కానీ అభిజిత్ మాత్రం మొదటి నుండి అలాగే ఉన్నాడు అని అన్నాడు. ఇక గంగవ్వ కూడా అదే మాట చెప్పింది. ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది అని అడిగితే తడుముకోకుండా అభిజిత్ పేరు చెప్పేసింది. అభిజిత్ కే బాగా ఓట్లు వస్తున్నాయి అతను గెలుస్తాడని నమ్మకం వ్యక్తం చేసింది. ధనరాజ్ ఒక కమెడియన్ గా మరో కమెడియన్ విన్నర్ అయితే తనకు చూడాలని ఉంది కానీ అభిజిత్ ఫేవరెట్ అని చెప్పాడు. కానీ గంగవ్వ మాత్రం అవినాష్ అస్సలు అవ్వడని బలంగా చెప్పింది.