బిగ్బాస్ ఇంటిలో బాగా ఆడి విజేత నిలవడం ఎంత ముఖ్యమో ఇంటి నియమాలు పాటించడం కూడా అంతే అవసరం. క్రమశిక్షణ తప్పితే అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటిలో మానసిక హింస ఎంత చేసినా శారీరక హింస మాత్రం చేయకూడదు. బిగ్ బాస్ లో కాలం కలిసి రాకపోతే బయట దాని ఎఫెక్ట్ తప్పదు. ఇక ఇంట్లో తెలుగు మాట్లాడకపోవడం ఈ మధ్య బాగా ఎక్కువైంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాధారణంగా ఆడియన్స్కు సుపరిచితులైన కంటెస్టెంట్స్ ఇంటిలోకి పంపిస్తూ ఉంటారు నిర్వాహకులు. పూర్తిగా తెలుగులో మాట్లాడాలి అనేది ప్రథమ నియమం.
కానీ షో లో మాత్రం ప్రతి రోజు కొంత మంది కంటెస్టెంట్స్ కాస్త ఓవర్ గా పరభాషను మాట్లాడడం అనేది ఆడియన్స్ కు అసలు నచ్చడం లేదు. మోనాల్ నార్త్ అమ్మాయి. అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉంది. తెలుగులో మాట్లాడటానికి గట్టిగా ప్రయత్నిస్తున్న ఆమెకు తెలియకుండానే హిందీ ఇంగ్లీష్ లోకి వెళ్లిపోతుంది. బిగ్ బాస్ కు వార్నింగ్ ఇచ్చి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అయినా సోమవారం ఎలిమినేషన్ సమయంలో హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేసి గట్టిగా వాదించింది.
మరోవైపు కూడా హారిక అదే తప్పు చేస్తోంది. తెలంగాణ భాషలో వీడియోలు చేసి మంచి క్రేజ్ అందుకున్న హారిక ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతుంది. ఆమెతో పాటు అభిజిత్ కూడా మాట్లాడుతున్నాడు. కానీ అతను చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు కాని హారిక మాత్రం ఇంగ్లీషులో తన వాదనను వినిపించడానికి ఇష్టపడుతుంది. అఖిల్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.
ఇక అసలే రేటింగ్స్ కోసం బిగ్ బాస్ టీం నానా తంటాలు పడుతుంటే వీరు మాత్రం ఇంగ్లీషులో మాట్లాడుతూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నారు. నాగార్జునకు కూడా ఎక్కువ పని చెబుతున్నారు. అలాంటి సమయంలో కంటెస్టెంట్స్ మాత్రం కీలకమైన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంగ్లీష్ లో మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. ఆడియన్స్ కు పాయింట్స్ సరిగా అర్థం కావు…. ఎవరికి ఓటు వేయాలో అర్థం కాని పరిస్థితి. మరి వీరిపై బిగ్బాస్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.