టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ హీరో నాగార్జున బిగ్ బాస్ నాలుగో సీజన్ హోస్ట్ గా బాగా వ్యవహరిస్తున్నాడు. మరీ ముఖ్యంగా మన్మథుడు, గ్రీకువీరుడు ఇంట్లోని ఆడవాళ్ళతో ప్రవర్తించే తీరు చాలా సరదాగా ఉంటుంది. నాగార్జునకు లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఒక లెవెల్ లో ఉంటుంది. అమ్మాయిలు నాగార్జున అంటే పడి చచ్చిపోతాడు. అతను అప్పటికే ఆడవాళ్ళ పక్షమే అలాంటి నాగార్జున. అలాగే సన్ డే, ఫన్ డే రోజు కూడా ఆడవారి వైపు మాట్లాడుతూ ఉన్న ఒక ప్రోమో విడుదలైంది.
గార్డెన్ ఏరియాలో ఇంటి సభ్యులందరినీ నాగార్జున వెరైటీ ఆటలు ఆడించాడు. అందులో భాగంగా కొందరు గ్రద్దలుగామరికొందరు చిన్న చిన్న పక్షులు పక్షులుగా మారి ఆట ఆడినట్లు చూపించారు. అయితే ఈ టాస్క్ లో అందరూ కలిసి అవినాష్ ను ఆడుకున్నట్లు అర్ధమైంది. ఆ తర్వాత అందమైన భామలు అని నాగార్జున పాటకు అవినాష్ డ్యాన్స్ చేశాడు.
అందమైన భామలు అనే పాటకి అందమైన భామలను తీసుకో అని నాగార్జున అడగడంతో మోనాల్, హారిక, అరియానా తీసుకొనివచ్చి అవినాష్ డాన్స్ వేసాడు. అందుకు నాగార్జున నువ్వు అందమైన భామలు అంటే ముగ్గురినే పిలిచావు… లాస్య ను ఎందుకు పిలవలేదు అని ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో అదే పనిగా ఆంటీ అనే ట్టాపిక్ ని అవినాష్ తెరపైకి తీసుకుని వచ్చాడు.
అప్పుడు నాగార్జున ఇంట్లో ఇంకోసారి ఆడవాళ్లను. ఆంటీలు ఫిగర్లు అంటూ తిరిగావనుకో…. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు ఆడవారు అందరూ అవినాష్ పై తిరగబడితే…. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడిగా సాయం చేయండి అంటూ నాగార్జునకు మొరపెట్టుకున్నాడు. కానీ నా సపోర్ట్ ఎప్పుడు ఆడవాళ్ళకి ఉంటుందని నాగార్జున తనలోని మన్మధుడిని బయటకు తెచ్చాడు.