బిగ్‌బాస్ ఇంటిలో సీజన్లు పోయే కొద్దీ మసాలా కంటెంట్ ఎక్కువ అవుతోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి, ఇక ముందు సీజన్లలో కూడా పునర్నవి-రాహుల్ సంపాదించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. బయటికి వెళ్ళిన తర్వాత ఈ లవ్ ట్రాక్ వారికి ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి వల్ల సీజన్‌కు మంచి రేటింగ్ వచ్చిందనే చెప్పాలి.
ఇక వరుణ్ సందేశ్-వితిక రొమాన్స్ కూడా బాగా పండింది. ఆ తర్వాత తాజాగా హారిక-అభిజిత్, అఖిల్-మోనాల్ ట్రాక్స్ హైలైట్ అయ్యాయి. అవినాష్-అరియానా మధ్య ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు. ఇక బుధవారం జరిగిన ఎపిసోడ్ లో అఖిల్ పుట్టినరోజు వేడుక జరిగింది. రాత్రి అందరూ గార్డెన్ ఏరియా లో కేక్ కట్ చేసిన అనంతరం అతనిని మోనాల్ హగ్ చేసుకోవడంతో పాటు ముద్దు మీద ముద్దు పెట్టింది.
దానికి స్పందించిన అఖిల్ నువ్వు బుగ్గ నాకు పైన ముద్దు పెట్టడం ఇదే ఫస్ట్ టైం కదా అని అన్నాడు. అందుకు మోనాల్ ఇది నీ బర్త్‌డే స్పెషల్ అని చిలిపిగా స్పందించింది. అందుకు అఖిల్ రోజూ నా పుట్టినరోజు అయితే ఎంతో బాగుండేది అనిపిస్తుంది అంటూ కామెంట్ చేయడం విశేషం. ఇలా ఇంటిలో మసాలా కంటెంట్ అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది. ప్రేక్షకులు కూడా బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు అని అర్థం అవుతోంది.
మొదట్లో ఫోకస్ లవ్ ట్రాక్ ల పైన ఉండేది. కానీ ఇప్పుడు ఫైనల్స్ దగ్గరపడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అభిజిత్- హారిక కూడా అంతకు ముందు కౌగిలింతల గురించి మాట్లాడింది చూశాం. ఇక ఇలాంటి ఇంట్లో ఇటువంటి మసాలా ఉంటే ఆ మజానే వేరు అనడంలో సందేహం లేదు.