బిగ్బాస్ చివరి వారంలో అందరూ రిలాక్స్ అయిపోయారు. అయితే ఒకరి గురించి ఒకరు వెనకాల మాట్లాడుకోవడం మొదలు పెట్టేసారు. ముఖ్యంగా అఖిల్ హారిక ముచ్చట్లు ఎక్కువైపోయాయి. అభిజిత్ హారిక తమ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోయిన వారం రచ్చ లేపిన సోహెల్, అరియానా కూడా దగ్గర అయిపోయారు.
ఇక వివరాల్లోకి వెళితే ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అనే టాస్క్ ఇంటి సభ్యుల మధ్య పెద్ద పెట్టినట్లు తెలిసింది. ఎక్కువమంది అరియానా ను పాయింట్ అవుట్ చేయడం ఆమె కూడా అందరికీ భారీగా కౌంటర్లు వేసినట్లు కనిపిస్తోంది. ఇక అరియానా గురించి అఖిల్ హారిక ఆమె వెనకాల చెవులు కొరుక్కున్నారు. ఆమె మాట్లాడిన మాటలను హేళన చేస్తూ ఆమె రియాలిటీ అది కాదు అని ఒక అంశాన్ని లేవనెత్తారు.
ఇక అమ్మరాజశేఖర్, దివి, అవినాష్ లను తలుచుకుంటూ ఎప్పటిలాగే అరియానా పర్ఫార్మెన్స్ మొదలు పెట్టింది. నేను టాప్-5లో కి వెళ్ళాను అమ్మ, దివి అంటూ ఎమోషనల్ అయిపోయింది. పక్కనే ఉన్న సోహెల్ తో అమ్మ రాజశేఖర్, దివి లతో తనకున్న అనుబంధం గురించి చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ఇక అభిజిత్ హారిక కు ఆమె అనర్హం అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఎవరి బాధ వారిదే అన్నట్లు అన్ సీన్ ఎపిసోడ్ కొనసాగింది.