తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో నాలుగో సీజన్ విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఇక భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సీజన్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్ ఎపిసోడ్ రేటింగ్ విషయంలో నేషనల్ రికార్డు బద్దలు కొట్టేశారు. ఇక ఓటింగ్ కూడా భారీగా నమోదవుతుందని స్వయంగా నాగార్జున చెబుతున్నాడు.
షో ప్రారంభమై మూడు నెలలు దాటిపోయింది. ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతానికి ఎనిమిది మంది మాత్రం మిగిలి ఉన్నారు. వీరిలో ఐదుగురు చివరివారం ఫైనల్స్ కు వెళ్తారు. ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి డిసెంబర్ 20 డేట్ ఫిక్స్ చేశారట. అందుకోసం ఇప్పటినుండి ప్లాన్ చేస్తున్నారట యూనిట్.
గెస్ట్ గా ఎవరిని తీసుకురావాలి…? ఫైనల్స్ లో ఎలాంటి గేమ్స్ ఆడించాలి…. అన్నది ప్రిపరేషన్ లో ఉంది. ఎలిమినేషన్, విజేతను ఎలా ప్రకటించాలి అన్న విషయంపై కూడా సమాలోచనలు జరుపుతున్నారు. ఇక ఈ సీజన్ పోటాపోటీగా సాగుతోంది. ఇక గెస్ట్ విషయంలో కూడా ఆచితూచి అడుగు వేస్తున్నారు.
మొదటి సీజన్లో హోస్ట్ ఎన్టీఆర్ ట్రీఫీ అందించాడు. రెండవ సీజన్ లో వెంకటేష్ వచ్చారు. మూడవ సీజన్ లో చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక నాలుగో సీజన్ దగ్గరికి వచ్చేసరికి ఏ ఫిలిమ్ స్టార్ ని పిలుస్తారన్న విషయంపై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. మరి ఆరోజు టైటిల్ కొట్టేది ఎవరు…? దానిని చేతికి ఇచ్చేది ఎవరు?