బిగ్ బాస్ షో లో గంగవ్వ ఎంట్రీ అన్నింటికంటే హైలెట్ అని చెప్పాలి. ఈసారి వచ్చిన కంటెస్టెంట్ లతో కొద్దిగా నిరాశ చెందిన ఆడియన్స్ కు గంగవ్వ కావాల్సిన బూస్ట్ ఇచ్చింది. అలాగే అదే విధంగా ఆమె ఇంటి నుండి షో మధ్యలో వెళ్లిపోవడం కూడా మరొక ఎత్తు. ఆరోగ్యం సహకరించక పోవడంతో ఆమె ఇంటి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది అని చెప్పారు. వచ్చిన మొదటి రెండు వారాల్లో అవ్వ ఆరోగ్యం బాగా దెబ్బతింది. కానీ బిగ్బాస్ ధైర్యం చెప్పిన తర్వాత కొద్దిగా పుంజుకుంది.
అయితే ఐదవ వారంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆమెను ఇంటి నుండి బయటకు పంపేందుకు నిర్ణయించుకున్నాడు. వారాంతంలో బయటకు వెళ్లిపోయిన గంగవ్వ స్టేజీపైన ఉన్నంతసేపు ఇక ఇంట్లో కూడా అఖిల్ అంటే తనకు ఇష్టమని చెప్పింది కానీ ఇప్పుడు మాత్రం తన స్వరం మారుతుంది. షో మొదటి రెండు వారాల్లో అందరూ గంగవ్వ చుట్టుముట్టి ప్రేమ కురిపించా.రు ఇక కొంతమంది అయితే సానుభూతి కోసం ఆమెకు సేవలు చేసిన వారు కూడా ఉన్నారు అని టాక్.
అయితే కొందరు మాత్రం నిజంగానే ప్రేమ కురిపించారు. అందులో అఖిల్ అందరికంటే ముందు ఉండేవాడు. గంగవ్వ కూడా అఖిల్ పై బాగా ప్రేమ కురిపించేసి. నువ్వు నా మనవడు లాంటి వాడివి బయటికి వెళ్ళిన తర్వాత నేను దత్తత తీసుకుంటాను పెళ్లి చేస్తా అంటూ గొప్పగా చెప్పేది. అఖిల్ తో మాట్లాడినట్టు ఇంకా ఎవరితో మాట్లాడేది కాదు. వెళ్ళేటప్పుడు అతను స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు అని కూడా మురిసిపోయింది.
అయితే ఇంటి నుండి బయటకు వచ్చిన మాత్రం బయట ఎవరికి ఫాలోయింగ్ ఉంది ఎవరు ఎలా వాడుతున్నారు అన్న విధంగా గంగవ్వ మాటలు మార్చినట్లు తెలుస్తోంది. దీపావళి స్పెషల్ గా అలీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఇంటర్వ్యూ చేశాడు. గంగవ్వ ను మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే తడబడింది. అఖిల్ కదా అని అడిగితే అందరూ అలా అనుకున్నారు కానీ నాకు అందరూ ఇష్టమే అని చెప్పింది. కాకపోతే అఖి నాకుల్ ఎక్కువ సేవలు చేశాడు నాకు సమయానికి గోలీలు అందించేవాడు అని చెప్పింది. మొత్తానికి గంగవ్వ ఇంటిలో కన్నా బయటకు వచ్చాక సేఫ్ గేమ్ ఆడటం మొదలు పెట్టింది అని చెప్పాలి.