బిగ్బాస్ ఇంటిలో అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ ఫైనల్ వరకు వస్తాడని ఎవరూ ఊహించలేదు. మొదట అతను ఎంట్రీ ఇచ్చినప్పుడైతే అసలు అంచనాలు లేవు. ఇక ఫైనల్ వరకు వచ్చి తన ప్రత్యర్థి తోనే పోటీ పడ్డాడు. ఇక అతనికి బయటకు వచ్చాక పెద్దగా అవకాశాలు రావడం లేదని వస్తున్న రూమర్స్ కు అడ్డుకట్ట వేసేలా అఖిల్ ఒక గోల్డెన్ ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా అతను నెగెటివ్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
సీరియల్ కు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పెద్దగా పాపులర్ కానీ అఖిల్ ఇంటి లోకి వచ్చిన తర్వాత పూర్తి ఫేమస్ అయిపోయాడు. అదృష్టవశాత్తు ఫినాలే టికెట్ కూడా ముందే సంపాదించాడు. ఇక ఒక వర్గం జనాలు కూడా అతనికి ఓట్లు గట్టిగానే వేశారు. అభిజిత్ ఫ్యాన్స్ ట్రోలింగ్ తట్టుకొని ఇన్నిరోజులు అఖిల్ ఇంటిలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఇక బిగ్ బాస్ నుండి వచ్చిన చాలామంది బయట భారీ ఆఫర్స్ అందుకుంటున్నారు.
సోహెల్, హారిక, మోనాల్ అయితే తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. ఇక అభి కూడా మెల్లగా అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి సమయంలో అఖిల్ కు పెద్దగా ఆఫర్లు లేవు అన్న టాక్ వినిపిస్తోంది. అయితే నిజానికి అఖిల్ కూడా ఒక ప్రాజెక్టు కోసం సెలక్ట్ అయినట్లు ఇన్ సైడ్ టాక్. అది కూడా విలన్ పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. ఇక ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?