బిగ్ బాస్ ఈ సీజన్ లో బయటకు వచ్చిన లవ్ ట్రాక్ లు మరే ఇతర సీజన్లలో ఇంతలా సందడి చేయలేదు అన్నది తెలిసిందే. ఒకటికి మూడు ట్రాకులు ఈ సీజన్ మొత్తం నడిచాయి. ఇక అభిజిత్-హారిక ల జంట అయితే స్టార్ పెయిర్ గా నిలిచింది. వీరిద్దరూ పలు వార్తల్లో హైలైట్ కూడా అయ్యారు. అయితే అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చిన తర్వాత హారిక నా చెల్లెలు లాంటిది అంటూ షాక్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అభి కామెంట్స్ పై హారిక మాట్లాడుతూ మరో వ్యక్తిని కామెంట్లు చేయడం గమనార్హం. మోనాల్ దూరమైన తర్వాత హారికకు బాగా క్లోజ్ అయిన అభి…ఆమెతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇక వీరిద్దరి పై కూడా బిగ్ బాస్ నిర్వాహకులు బాగా ఫోకస్ చేశారు. వీరిద్దరి మధ్య లవ్ నడుస్తున్నట్లు చూపించారు. చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం, కౌగిలింతలు, గొడవలు, అలకలు లాంటివి వీరిద్దరి మధ్య బాగానే జరిగాయి.
వీరిద్దరి పేర్లను కలిపి ‘అభిక’ అని అభిమానులు ట్రెండ్ కూడా చేశారు. ఇక హౌస్ లోపలికి వెళ్ళేటప్పుడే బిగ్ బాస్ ఇద్దరి మధ్య కనెక్షన్ గేమ్ కూడా పెట్టాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన గురించి మాట్లాడుతూ మేమిద్దరం అన్నాచెల్లెళ్ల రిలేషన్ లోనే ఉన్నాము…. అందుకే అతడి దగ్గర నాకు అంత చనువు, కానీ మమ్మల్ని లవర్స్ చేసిన క్రెడిట్ బిగ్బాస్ ఎడిటర్ కే ఇవ్వాలి అని హారిక అనింది.
అసలైన సీన్లు చూపించకుండా ఎడిటింగ్ చేయడం వల్లే మాకు లవర్స్ అనే ట్యాగ్ వచ్చింది అని హారిక ఎడిటర్ ను నిందించడం గమనార్హం.