బిగ్బాస్ ఇంటిలో రేస్-2 ఫినాలే టాస్క్ సాగుతోంది మొదటి లెవెల్ లో భాగంగా ఇంటిని పాల కేంద్రంగా మార్చారు. గేదె బొమ్మ నుండి పాలు పట్టుకునేందుకు ఇంటి సభ్యులు తీవ్రంగా గొడవ పడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. కొంతమంది ఇలా అయితే మా వల్ల కాదు అంటూ మధ్యలోనే వదిలేశారు మరికొందరు నానా కష్టాలు పడి చివరికి ఓడిపోయారు. మొత్తానికి ఈ టాస్క్ పూర్తయ్యేసరికి నలుగురు మాత్రమే మిగిలారు.
పాలను సేకరించడంలో అవినాష్, అరియానా, మోనాల్ వెనుకబడ్డారు. మిగిలిన అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని అవినాష్ మధ్యలోనే ఆపేశాడు. కిచెన్ లోని పాల ప్యాకెట్ లను నీళ్ళతో కలిపి పాలసీసాలు సంఖ్యను అడ్డదారిలో పెంచుకున్నాడు. అలా చేస్తే రూల్స్ కి విరుద్ధం అని చెప్పి బిగ్ బాస్ అవినాష్ ను పక్కకి తప్పించాడు. ఇక రెండవ లెవెల్ కి వెళ్ళిన అమ్మాయి హారిక ఒక్కటే కావడం విశేషం. మిగతా అందరూ అబ్బాయిలే.
ఇక రెండవ లెవెల్ కు బిగ్బాస్ అదిరిపోయే టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పై నుంచి వచ్చే పూల ను తీసుకుని పాతిపెట్టాలి అని తెలిపాడు. దీనికోసం గార్డెన్ ఏరియాలో పూల కోసం మళ్ళీ అందరూ గొడవ పెట్టుకున్నారు. అయితే సోహెల్ హారికను టార్గెట్ చేసి ఆమె చేతి ని పట్టుకొని పూలను సేకరించి అడ్డుపడడంతో హారిక హర్ట్ అయినట్లు తెలుస్తుంది.
పై నుండి పడుతున్న వాటిని ఇవ్వడంలేదు…. చేతుల నుంచి తీసుకోవద్దు అంటున్నారు ఇలా అయితే ఒక లేడీ కంటెస్టెంట్ ఇక బిగ్ బాస్ టైటిల్ గెలిచినట్లే అని హారిక తన ఆవేదన వ్యక్తం చేసింది. మరి సోహెల్ కావాలని హారికను అడ్దుకున్నాడా? అఖిల్ తో కలిసి గేమ్ ఆడుతున్నాడా? అన్నది పూర్తి ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది.