బిగ్ బాస్ నాలుగవ సీజన్ చివరివారంలో ఐదుగురు కంటెస్టెంట్ లు మిగిలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాప్ 5 లో నుండి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఇంటి నుండి బయటకు పంపించే కార్యక్రమం మొదలైంది ఇక ఈ సీజన్ కి చిట్ట చివరి ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా సాగిందో చూద్దాం…
బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్ ముగింపు వేడుకలను అట్టహాసంగా హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. అన్ని సీజన్ల కంటే భిన్నంగా ఈ ఎపిసోడ్ డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ తారలతో వినోదభరితమైన కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఇక మూడు నెలలుగా ఫాలో అవుతున్న వారికి ఊహించినట్లుగానే చివరి ఐదుగురిలో మొదట ఇంటి నుండి బయటకు ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటారో వారే వెళ్లిపోయారు.
హారిక కు అందరికన్నా అత్యల్పంగా ఓట్లు వచ్చినట్లు సమాచారం. ఓటింగ్ శాతం ప్రకారం ఫైనల్ ఎలిమినేషన్ ప్రక్రియలో మొదటి కంటెస్టెంట్ గా హారిక నిలిచినట్లు చెబుతున్నారు బిగ్బాస్. ఇంటిలో చోటూ అనే ముద్దు పేరుతో పిలవబడే హారిక టాప్ ఫైవ్ లో నుండి బయటకు వచ్చేసిన మొదటి సెలబ్రిటీ అయింది. ఇక శనివారం ఆమెతోపాటు మరో కంటెస్టెంట్ చేసి ఎపిసోడ్ నిలిపివేసే అవకాశం ఉంది.
దీంతో ఇంటిలో అఖిల్ సయ్యద్, సోహెల్, అభిజిత్, అరీయానా మిగిలారు. అనధికారికంగా అభిజిత్ గెలిచాడు అని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక రేపటితో మూడు నెలలు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ముగియనుంది.