బిగ్ బాస్ షో చివరి దశకు వచ్చేసరికి మరింత ప్రజాదరణను పొందుతోంది. లోపల కంటెస్టెంట్ భావోద్వేగాలు కంట్రోల్ లో పెట్టుకోలేకున్నారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా కీలకమైనది ఇలాంటి సమయంలో సెలబ్రిటీలు కూడా ఈ షో పైన తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అఖిల్, సోహెల్, అభిజిత్ లకు విపరీతమైన సపోర్ట్ లభిస్తోంది.
అఖిల్ కు కూడా సెలబ్రిటీల నుండి మంచి సపోర్ట్ వస్తోంది. కమెడియన్ పృథ్వి, షాయాజీ షిండే వంటివారు అఖిల్ కు ఓట్లు వేయమని ప్రచారం చేస్తున్నారు. మరొకవైపు అభిజిత్ కు కూడా మంచి ఓటింగ్ వస్తోంది. నాగబాబు అభిజిత్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా హీరో శ్రీకాంత్ కూడా బిగ్ బాస్ షో పైన తన అభిప్రాయాన్ని తెలిపారు.
గత సీజన్లో బిగ్ బాస్ ఎపిసోడ్ లోడీల్ మాట్లాడేందుకు శ్రీకాంత్ ఇంట్లో కి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎవరు ఒప్పుకోలేదు. ఇక ఈ సీజన్ కూడా శ్రీకాంత్ బాగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అతను షో గురించి అంత బాగా విశ్లేషించాడు. గెలిచే అవకాశం ఎవరికి ఉందని శ్రీకాంత్ అడిగినప్పుడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. అందరిలోకి అభిజిత్ స్ట్రాంగ్ గా ఉన్నాడు అని చెప్పిన అతను మిగిలిన ఐదుగురు ఫైనల్స్‌కు వెళ్తారని ఊహిస్తున్నాడు. ఇక తన అంచనా ప్రకారం అభిజిత్ విన్నర్ అవుతాడని శ్రీకాంత్ భావిస్తున్నట్లు తెలిపాడు.