బిగ్ బాస్ 4 : అవినాష్ కోస్ం రంగంలోకి జబర్దస్త్ ఆర్టిస్టులు… వర్క్ అవుట్ అయితే నేరుగా ఫైనల్స్ కే

బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే గేమ్ ఆఫ్ ట్విస్ట్ లు. ఎప్పటికప్పుడు షో నిర్వాహకులు ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి కొత్త ప్లాన్ లతో ముందుకు వస్తారు. ఇక 12వ వారం నామినేషన్ లో మోనాల్, అఖిల్, అవినాష్ అరియానా ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అయిపోయినా ఇంట్లో కేవలం ఆరుగురు మాత్రమే మిగులుతారు. ఈవారం ఎలిమినేషన్ అంత కీలకం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సారి కెప్టెన్సీ టాస్క్ కోసం తమ సర్వస్వం ఒడ్దుతారు అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.

 

ఇక వీరి నలుగురిలో ఎవరు కెప్టెన్ అవుతారు అన్న విషయాన్ని పక్కన పెడితే…. బిగ్బాస్ ఒక కొత్త గేమ్ ప్లాన్ తో దిగినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చిన లీకుల ప్రకారం నేటి ఎపిసోడ్ అవినాష్ కు అదిరిపోయే ఆఫర్ లభించినట్లు నీకు బయటికి వార్తలు వస్తున్నాయి. నామినేట్ అయిన ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు అని అందులో భాగంగా గెలిచిన వారికి రెందు వారాల ఇమ్యూనిటీ లభించింది అని అలా ఆ టాస్క్ లో అవినాష్ గెలిచి ఇమ్యూనిటీ సాధించాడు అని అంటున్నారు.

ఇక అదే గనుక నిజం అయితే అవినాష్ ఈ ఒక్క వారం సేఫ్ అయితే చాలు…. నేరుగా టాప్ ఫైవ్ లోనికి వెళ్ళిపోతాడు. ఇలాంటి సమయంలో ఇప్పటికే నెటిజన్లు అవినాష్ పైన తీవ్ర కోపంతో ఉన్నారు. అతను మోనాల్ పై నోరు పారేసుకున్నందుకు అందరూ వ్యతిరేకత చూపిస్తున్నప్పుడే జబర్దస్త్ ఆర్టిస్టులు రంగంలోకి దిగారు. ఈవారం సేఫ్ అయితే నేరుగా అవినాష్ ఫైనల్స్ కు వెళ్ళిపోతాడు. కాబట్టి అభిలాష్ కు ఓటు వేయండి అంటూ జబర్దస్త్ నుండి గెటప్ శీను, ధన్ రాజ్ వంటివారు పోస్టులు పెడుతున్నారు. ఇక అవినాష్ ఈ వారం ఎలిమినేట్ కాకపోతే అతని కన్నా లక్కీ ఎవరు ఉండరు…!