బిగ్ బాస్ ఇంటిలో 86 వ రోజు జరిగిన ఎపిసోడ్ కి సంబంధించిన అన్ సీన్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. డాన్స్ షో తర్వాత ఇంటి సభ్యులు అంతా లాన్ లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ రిలాక్స్ అయ్యారు. సోహెల్, అఖిల్, మోనాల్ ఒక పక్కన కూర్చుని మాట్లాడుకుంటుంటే పెళ్లి టాపిక్ వచ్చింది. ఆ ముగ్గురి మధ్య భార్య గురించి ఆసక్తికరమైన డిస్కషన్ జరిగింది.
మోనాల్ తో సోహెల్ మాట్లాడుతూ నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలా…? అదృష్టవంతురాలా…? అని అడిగాడు. అందుకు మోనాల్ సూపర్ లక్కీ అని సమాధానం ఇచ్చింది. వెంటనే అఖిల్ జోక్యం చేసుకుని మరి నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి పరిస్థితి ఏమిటని అడిగితే చాలా సేపు మోనాల్ ఆలోచనలో పడింది. దాంతో సోహెల్ గట్టిగా నవ్వాడు. ఇక అఖిల్ తన పెళ్లి గురించి స్పందిస్తూ నేను మా అమ్మ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు.
“నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు నువ్వు పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ చేసుకుంటావు” అని మోనాల్ సమాధానం ఇచ్చింది. ఇక వెంటనే అఖిల్ నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోను…. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నాడు. కానీ దానికి మోనాల్ మాత్రం లేదు నువ్వు ఖచ్చితంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావు మీ అమ్మ ఈ అమ్మాయి బాగా ఉంది అంటే ఆ అమ్మాయినే చేసుకుంటావని బల్లగుద్ది మరీ చెప్పింది.
సోహెల్ కూడా తన పెళ్లి గురించి మాట్లాడుతూ… నాది కూడా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని అన్నాడు. అప్పుడు అఖిల్, సోహెల్ కు మీరు మీ అమ్మాయిలు డిసైడ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అని తేల్చి చెప్పేసింది. అఖిల్ నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని…. ఇప్పుడు నాకు 25 ఏళ్లు నా పెళ్ళికి ఇంకా ఐదేళ్ల సమయం ఉంది…. ఇప్పుడే పెళ్లి చేసుకుని టైం వేస్ట్ చేయను… లైఫ్ ను ఎంజాయ్ చేస్తాను అని అన్నాడు.