బిగ్ బాస్ 4 : వాళ్ళపై భారీగా ఫైర్ అయిన నోయల్..! అలా చేయడం తప్పట

ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెలబ్రిటీలు అన్న తర్వాత వారిపై ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ ను ట్రోల్ చేయకుండా ఉంటారా? షో ప్రసారం అయ్యే గంటతో జనాలు వారిని జడ్జ్ చేసేస్తారు. ఒక గంటలో వారు ప్రవర్తించిన తీరును బట్టి అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు.

 

దీని పై తాజాగా నోయల్ సీరియస్ అయ్యాడు. బిగ్ బాస్ షో లో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్ పైన వచ్చిన ట్రోల్ గురించి వితిక షేరు మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో అందరూ తమపై వచ్చిన విమర్శలు, వాటి వల్ల తాము డిప్రెషన్ కు గురయ్యామని వాపోయారు. కంటెస్టెంట్ కు సపోర్ట్ చేయడం అంటే మిగతా వాళ్ళని టార్గెట్ చేయడం కాదని అన్నారు. నోయల్ కూడా అలాంటి ఒక సందేశాన్ని ఇచ్చాడు. కంటెస్టెంట్ లు అందరూ మంచి వాళ్ళని…. వాళ్ళని ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించాడు.

ఆడవాళ్లను దారుణంగా విమర్శిస్తూ ఉండడం తప్పు అని చెప్పుకొచ్చాడు. కంటెంట్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు ఎదవలు అని ముద్ర వేస్తున్నారు. వారి క్యారెక్టర్ ను డిసైడ్ చేసే హక్కు తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుందని దయచేసి మానివేయండి అని వేడుకున్నాడు. షోలో నోయల్ పైన కూడా దారుణమైన ట్రోలింగ్ జరిగింది.

తన తండ్రి ఉద్యోగం విషయంలో అబద్ధం చెప్పాడని డిఫెన్స్ ఉద్యోగి అయిన తన తండ్రిని సింపతి కోసం రోజువారి వేతనానికి పని చేసేవాడు అంటూ అబద్ధం చెప్పాడని ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ తర్వాత అవన్నీ తప్పుడు వార్తలను నోయల్ సోదరుడు క్లారిటీ ఇచ్చాడు.