బిగ్బాస్ ఇంటిలో 13వ వారం నామినేషన్ ప్రక్రియ చాలా ఉద్వేగాల మధ్య జరిగింది అని తెలిసిందే. అఖిల్, మోనాల్ మధ్య మరొకసారి ఎమోషనల్ వాగ్వాదం జరిగింది. అఖిల్ అనుసరిస్తున్న తీరుపై మోనాల్ విరుచుకుపడుతూ… నువ్వు మెదడుతో ఆడుతున్నావు నేను మనసుతో ఆడుతున్నాను అనే పాయింట్ పైన వారిద్దరు గొడవ పడటం జరిగింది. అఖిల్ తో వాగ్వాదం అయిపోయింది. ఆ తర్వాత మోనాల్ బోరుమని ఏడుస్తూ కిచెన్లోకి పరుగులు పెట్టింది.
టాప్ దగ్గరికి వెళ్లి ముఖంపై నీళ్లు చల్లుకుంటూ ఏడుస్తుంటే వెనకాలే వెళ్ళిన హారిక ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది. అయినా కానీ ఆమె వెక్కివెక్కి ఏడ్చింది. ఇదే సమయంలో వాళ్ళు చేస్తే కరెక్ట్ నేను చేస్తే తప్పు అని మండిపడింది. నేను ఒకరి కోసం ఇక్కడికి రాలేదు అవతలివాళ్ళు ఫీలింగ్స్ పట్టించుకోలేదు నా ఫ్యామిలీ కోసం గేమ్ ఆడడానికి వచ్చాను అని చెప్పింది. ఇంటి లోకి వచ్చిన తర్వాత మూడు వారాల నేను ఎంత మెంటల్ టెన్షన్ అనుభవించిన నాకు తెలుసు అని చెప్పింది. అదే సమయంలో అభి, అఖిల్ తో ఆమెకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్న విషయం తెలిసిందే.
ఈ విషయం అఖిల్ కు కూడా తెలుసు అని తన బాధ ను హారికతో పంచుకుంది. నేను ఇప్పటి వరకు దాదాపు ప్రతి వారం నామినేట్ అయ్యాను… అప్పుడు ఎంత బాధ పడ్డానో నాకు తెలుసు అని అనింది. ఇక నువ్వు అఖిల్ నాతో నువ్వు నీ గేమ్ ఆడు అన్నాడు నేను నా గేమ్ ఆడతా అన్నాడు…. నేను ఆడుతూ ఉంటే ప్రామిస్ బ్రేక్ చేసింది అని అంటున్నాడు అన్న మోనాల్ అవినాష్ ప్రతి వారం నామినేట్ చేస్తున్నాడు అని విలపించింది. పులిహార చేయలేదని నామినేట్ చేశాడు ఇది అసలు కరెక్టేనా అంటూ హారిక తో తన బాధ చెప్పుకొంది. పులిహోర చేయకపోతే నామినేట్ చేస్తాడా అని హారిక నవ్వుల్లో మునిగిపోగా మోనాల్ కూడా కాస్త కుదుటపడి మళ్ళీ నామినేషన్ ప్రక్రియ లో పాల్గొంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?