ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తల దూరుస్తూ ఉంటాడు. ఆరంభంలో భారత దేశంలోనే గొప్ప చలనచిత్ర దర్శకులలో ఒకరు అని పేరు పొందిన వర్మ ఆ తర్వాత సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ సినిమాలు తీసి వివాదాస్పద దర్శకుడిగా మారాడు. ఇప్పుడు అతని సినిమాలు పరమ చెత్తగా ఉన్నాయి అంటూ సినీ అభిమానుల్లో టాక్ నడుస్తోంది.
ఇక ఎప్పుడూ వరుస సినిమాలతో ప్రేక్షకుల తో సంబంధం లేకుండా బిజీగా ఉంటాడు ఆర్జివి. అలాంటి వ్యక్తి తొలిసారి బిగ్ బాస్ షో పైన స్పందించాడు. అందులో ఒక కంటెస్టెంట్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రేక్షకులను కోరారు. ఇక తెలుగు లో భారీ రెస్పాన్స్ అందుకుంటున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో నాలుగవ సీజన్ గ్రాండ్ ఫైనల్ మరొక వారం రోజుల్లో జరుగుతోంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఈ షో పైన రామ్‌గోపాల్‌వర్మ స్పందించాడు.
గతంలో ఈ షో ను ఉద్దేశించి గోపాల్ వర్మ గతంలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్‌బాస్ అంటే ఏమిటి? ఎప్పుడో హిందీలో ఎవరో అంటే విన్నాను… తెలుగులో కూడా మొదలైందా? అసలు నాకు దాని గురించి తెలియదు అని అన్నాడు. తర్వాత ఈ మధ్య కాలంలో దాని గురించి తెలుసుకున్నాడు ఏమో కానీ అందులో కంటెస్టెంట్ అయినా గ్లోరీ కి మద్దతుగా ఒక ట్వీట్ చేశాడు. అందరూ ఓటు వేసి అరియానా ను గెలిపించండి బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు ఆమె అర్హు రాలు అని పేర్కొన్నాడు.
బిగ్ బాస్ ఇంటి వరకు అరియానా వెళ్లడానికి కారణం రామ్ గోపాల్ వర్మ నే కావడం విశేషం. ఆమె ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో బాగా నచ్చిందని నిర్మొహమాటంగా అరియానాకు చెప్పేశాడు. దాంతోనే ఆమె బాగా ఫేమస్ అయింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!