బిగ్బాస్ ఇంటిలో చివరివారం నామినేషన్ల లో అఖిల్ మినహాయించి అందరూ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రజలే ఈ వారం ఇంట్లో ఎవరు సరిగ్గా మిగిలిన పరిస్థితులను చక్కబెట్టారు, పాలించారు అన్న విషయాన్ని విశ్లేషించి ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి బిగ్బాస్ తెలివిగా ఇంటిలోని ప్రతి సభ్యునికి రాజ్యాధికారాన్ని ఇచ్చే లాగా టాస్క్ డిజైన్ చేశాడు.
కిరీటం ఉన్నంతసేపు ఇంటిలో వారి ఆజ్ఞలను అందరూ పాటించాలి. ఈ క్రమంలో ముందుగా సోహెల్ కిరీటం దక్కించుకున్నాడు. అయితే సోహెల్ అందరిని వదిలేసి అరియానా ను టార్గెట్ చేయడం అతనికి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఒకవైపు అరియానా ను సోహెల్ టార్గెట్ చేస్తున్నాడు అని తెలిసి ఇంటిలో కామెడీ చేసేసింది. నిన్నంతా అరియానాదే ఎంటర్టైన్మెంట్ అంటే అతిశయోక్తి కాదు. అవినాష్ లేని లోటు తెలియకుండా చేసింది.
సోహెల్ ఆమెకి ఇచ్చిన పనిని ఆడుతూ పాడుతూ చేస్తూ మధ్యలో అతనిని చిరాకు పెడుతూ మంచి మార్కులు కొట్టేసింది అనే చెప్పాలి. ఇక రాజ్యాధికారం చేతిలో ఉన్నప్పుడు సోహెల్ సీరియస్ గా ఉండకుండా ఫన్నీ గా ఉండేందుకు ప్రయత్నించాడు. పైగా అతనిని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కావాలని పాట పగలను దృష్టిలో పెట్టుకొని అరియానా ను హింసించడమే లక్ష్యంగా అతని పాలన సాగింది అన్న నెగటివ్ ఇంప్రెషన్ వచ్చింది. ఇక అరియానా ఉన్నంతసేపు వీక్షకులను బాగా ఆకట్టుకుంది. అను ఎందుకు ఫైనల్ దరిదాపుల్లోకి వచ్చిందో తెలియజేసింది.