జబర్దస్త్ నుండి బిగ్ బాస్ కు వెళ్ళిన తర్వాత తన క్రేజ్, పాపులారిటీ మరింత పెంచుకున్న కమెడియన్ ముక్కు అవినాష్ పేరు ఎప్పుడూ లేని విధంగా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతుంది. అతని ఫ్యాన్స్, ఫాలోయింగ్ సంఖ్య కూడా పెరిగింది. తన జీవితంలో ఎన్నో విషయాలను ఇంటర్వ్యూల ద్వారా పంచుకున్న అవినాష్ తాజాగా మరో కొత్త విషయాన్ని బయట పెట్టాడు.
ఒక సమయంలో ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ తన చెంప పగలగొట్టాడు అంటూ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అవినాష్ వివరణ ఇవ్వడం గమనార్హం. వివరాల్లోకి వెళితే…. ఒక తప్పుడు ఆలోచన తీసుకోవడం వల్లనే అతను నన్ను కొట్టినట్లు అవినాష్ చెప్పాడు. అంతేకాకుండా ఈ విషయం ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరకు వెళ్లినట్లు కూడా తెలిపాడు.
అవినాష్ బాగా ఎమోషనల్ అవుతాడు అని అందరికి తెలిసిందే అయితే తనకు ఎలాంటి బాధ ఉన్నా ముందుగా గెటప్ శ్రీను అన్నతో చెప్పుకుంటాను అని అవినాష్ అన్నాడు. తనతో ఒకసారి నాకు చచ్చిపోవాలని ఉంది అని చెప్పడంతో ఆయన ఏమీ అనకుండా ఒకసారి ఇంటికి రమ్మని పిలిచాడట. ఇంటికి వెళ్ళగానే గెటప్ శ్రీను అన్న నా రెండు చెంపలు వాయించేసాడు అని అవినాష్ చెప్పాడు.
అలాంటి తప్పుడు ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోవద్దని కూడా చెప్పినట్లు అవినాష్ తెలిపాడు. ఇక తనతో మాట్లాడిన తర్వాత శ్రీను…. పూరి జగన్నాథ్ కు ఫోన్ చేసి చెప్పినప్పుడు ధైర్యం చెప్పి…. టెన్షన్ పడవద్దు అని అన్నట్టు పూరి అన్నట్లు అవినాష్ చెప్పాడు. నీ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి అని పూరి చెప్పినప్పుడు తనకు చాలా బాగా అనిపించింది అని అవినాష్ అసలు విషయాన్ని బయటపెట్టాడు