బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో 10వ వారం ఎలిమినేషన్ కు సంబంధించిన వివరాలు బయటకు లీకయ్యాయి. సభ్యులలో ఎవరు నామినేట్ అయ్యారు అన్న విషయం బయటకు వచ్చింది. ఇక ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరు అనే విషయం పై అంచనాలు కూడా మొదలైపోయాయి. గతవారం అమ్మరాజశేఖర్ బయటకు వెళ్ళిపోయాడు. కెప్టెన్ అయ్యుండి ఎలిమినేట్ అయిన తొలి వ్యక్తిగా బిగ్‌బాస్ చరిత్రలో అమ్మరాజశేఖర్ చరిత్ర సృష్టించాడు.
అయితే నాగార్జునతో ఎలిమినేట్ అవుతున్నందుకు తనకేమీ బాధగా లేదని ఆనందంగానే బయటకు వెళ్తున్నాను అని నాగార్జునతో అమ్మ చెప్పడం విశేషం. ఇక ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇవాళ నామినేషన్ ప్రక్రియ కోసం కొత్త కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ బరిలోకి దిగాడు. మీకంటే మేమే బెటర్ అనే కాన్సెప్ట్ కి ఇంటి సభ్యులు ఇంట్లో తన అనుభవాల ఆధారంగా ఎలిమినేట్ చేసుకోవాలి అని తెలిపారు. ఇంటిలో వారికి ఉండే అర్హత లేదన్న అభిప్రాయానికి వస్తే వారిని నామినేట్ చేయాలి…. ఎందుకు బెటర్ అనే విషయాన్ని బయటకు చెప్పాలి అన్నాదు
అప్పుడు అఖిల్ అభిజిత్ ని నామినేట్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ప్రతి ఒక్కరి మధ్య మాటల యుద్ధం జరిగింది. సభ్యుల మధ్య జరిగిన భారీ వాగ్వాదాలు కొన్ని లీక్ అయ్యాయి. మొత్తానికి పూర్తిగా గందరగోళం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నామినేట్ అయిన కంటెస్టెంట్ లో అభిజిత్, హారిక, మోనాల్, అరియానా, మెహబూబ్ ఉన్నారు. ఇప్పటివరకు ఇంటిలో డబల్ ఎలిమినేషన్ చోటు చేసుకోలేదు. ఇలాంటి సందర్భంలో వీరు ఐదుగురు చాలా డేంజర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో బయటపడేది ఎవరు అన్నది వేచి చూడాలి
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?