బిగ్‌బాస్ ఇంటిలో మొదటి నుండి ఒక ఇంటి సభ్యుడి పైన చాలా మంది మంచి అభిప్రాయం తో ఉంటారు. దాదాపు వారు ఫైనల్స్ వరకు వస్తారు కానీ అక్కడి నుండి ఆట మారిపోతుంది. అయితే ఈసారి అటువంటి వ్యక్తులు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని చెప్పాలి. అభిజిత్, అఖిల్, సోహెల్, అరియానా ప్రస్తుతం టాప్ కంటెస్టెంట్లు గా ఇంటిలో కొనసాగుతున్నారు. టైటిల్ కూడా వీళ్ళు నలుగురు మధ్యనే ఉంటుంది అని బయట డిబేట్ లు జరుగుతున్నాయి.
ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అభిజిత్ టైటిల్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అతనికి పోటీ ఇచ్చేది ఎవరు అనే విషయం వచ్చినప్పుడు ఈ వారం జరిగిన పరిస్థితులవల్ల సోహెల్ ఇంకా అరియానా అభిజిత్ కు గట్టి పోటీ ఇవ్వవచ్చు అని చెబుతున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఒక పెద్ద గొడవకు దిగారు. ఎవరి పాయింట్ వారి దగ్గర ఉంది వీరిద్దరి ఫాన్స్ స్ట్రాంగ్ గా అయిపోతారు… అంతేకాకుండా ఇప్పటివరకు న్యూట్రల్ గా ఉన్న ఫ్యాన్స్ కూడా వీరిద్దరిలో ఎవరో ఒకరు వైపు మళ్లుతున్నారు.
పైగా గత రెండు వారాల నుండి అభిజిత్ కు తనను తాను నిరూపించుకునే అవకాశం తక్కువ వస్తుంది. అఖిల్ సైలెంట్ అయిపోయాడు కాబట్టి అతనితో గొడవ పడేవారు లేరు. తన పని తను సైలెంట్‌గా చేసుకుంటున్నాడు. ఎక్కువగా స్క్రీన్ పైన కనబడింది అరియానా, సోహెల్ మాత్రమే కాబట్టి అభిజిత్ ఏదో ఒక వ్యూహంతో ముందుకు రాకపోతే వీరిద్దరి నుండి అతనికి పెనుముప్పు పొంచి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!