బిగ్ బాస్ 4 : నోటి దురుసు తో ఈ వారం ఎలిమినేషన్ టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకున్న ఆ కంటెస్టెంట్?

సోమవారం బిగ్ బాస్ షో చాలా రసవత్తరంగా సాగింది. అదృష్టం, దురదృష్టం ప్రధాన పాత్రలు అయినా నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ బిగ్బాస్ డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. ఇక దురదృష్టం వెంటాడి నలుగురు ఈవారం ఎలిమినేషన్ లోకి నేరుగా ఎంటర్ అయ్యారు. అరియానా, అభిజిత్, అఖిల్, అవినాష్ ముందుగా ఎర్ర రంగు టోపీలను పెట్టుకున్నారు.

 

ఇక రెండవ లెవెల్ లో బిగ్ బాస్ స్వాపింగ్ చేసుకునే అవకాశం ఇస్తే…. మోనాల్, సోహెల్ ఎవరితో కూడా స్వాపింగ్ చేసుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో బిగ్బాస్ కెప్టెన్ అయిన హారికకు ఆదేశాలు ఇచ్చాడు. అలాగే ఆ అధికారంతో హారిక అభిజిత్ ను మోనాల్ తో స్వాప్ చేసింది. దీంతో అభి ప్లేస్లో మోనాల్ నామినేట్ అయింది.

అయితే అవినాష్ మాత్రం మాట్లాడిన తీరు అతనికి ఇంటి బయట భారీ నెగిటివిటీ పెంచింది. మోనాల్ పై అవినాష్ ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయాడు. ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు…. నువ్వు ఈ షో కి పనికిరావు నీ కంటే నేనే బెటర్…. 200 శాతం నేనే బాగా ఆడుతాను అంటూ విర్రవీగాడు. ఇక ఇలా రెచ్చిపోయి అవినాష్ గొప్పలకు పోవడంతో బయట అందరూ అతనిని వ్యతిరేకిస్తున్నారు.

నిజానికి ఒక నాలుగు వారాల నుండి అవినాష్ పరిస్థితి ఇంటిలో ఏమీ బాగోలేదు. అతను ఎంటర్టైన్ చేసే సమయం అయిపోయింది. మైండ్గేమ్ సమయంలో లో సైలెంట్ అయిపోయాడు అంతేకాకుండా అనవసరంగా ఆడవారి తో గొడవ పెట్టుకోవడం కూడా అతనిని దెబ్బతీసింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో అవినాష్ మోనాల్ పై విరుచుకు పడటం అతనికి ఏమాత్రం మంచిది కాదు.

పైగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ల లో అవినాష్ ముందు ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా… అరియానాతో “నాకు ఒకటి అర్థం అయింది… ఈ ఇంట్లో టాస్క్ లు మంచిగా ఆడితే గెలవలేము” అని బిగ్ బాస్ నే నిందించాడు. మరి అవినాష్ నిజంగా తన నోటి దురుసు తో ఎలిమినేషన్ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు అంటారా?