బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగేందుకు ఒకే ఒక్క వారం మిగిలి ఉంది. ఇక ఈ వారం లో ఒకరు ఎలిమినేట్ అయిపోతే మిగిలిన ఐదుగురు చివరివారంలో కి ఎంటర్ అవుతారు. అక్కడి నుండి గేమ్ మామూలుగా ఉండదు. ఇక ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటేందుకు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ప్రస్తుతం ఇన్ని వారాలు జరిగిన ఓటింగ్ బయటకు వస్తున్న రిపోర్టుల ప్రకారం టైటిల్ కొట్టే ఛాన్స్ కొద్దిమందికే ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం ఇంటిలో ఉన్న ముగ్గురు మేల్ కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్. వారిలో అఖిల్ ఆల్రెడీ ఫైనల్స్ కు వెళ్లి పోయాడు. ఇక అభిజిత్, సోహెల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ. మిగిలిన ముగ్గురు ఆడవారిలో బాగా బలహీనమైన కంటెస్టెంట్ గా మోనాల్ కనిపిస్తోంది.
గత రెండు వారాల నుండి అఖిల్ సోహెల్ పైన జనాల్లో కొద్దిగా నెగటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది. మరో వైపు చూస్తే ఈవారం అరియానా చక్కటి స్ట్రాటజీ తో దూకుడు ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నంతా సందడి ఆమెదే పైగా చాలా మంది అమ్మాయిలకు అరియానా యాటిట్యూడ్ నచ్చింది అనే చెప్పాలి. అభిజిత్ మొదటినుండి టైటిల్ ఫేవరెట్ గా కొనసాగుతూనే ఉన్నాడు. ఓటింగ్ సిస్టం కూడా వీరిద్దరిని చాలాసార్లు ఎలిమినేషన్ నుండి రక్షించింది.
కాబట్టి దాదాపు అభిజిత్ అరియానా ల మధ్యనే ఒక విన్నర్ ఉంటారని అంటున్నారు. అఖిల్ సోహెల్ కలిసి ఆడడం కూడా వారికి మైనస్ అని చెప్పాలి. మరి బిగ్ బాస్ అనుకున్నట్లు జరుగుతుందా చివరి సమయంలో ఏదైనా ట్విస్టులు ఉంటాయా అన్నది వేచిచూడాలి.