బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకున్న తరుణంలో మిగిలిన ఏడుగురిలో ఏ ఇద్దరు ఇంటి బాట పడతారు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న వారు కూడా అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. అఖిల్ ఫినాలే టికెట్ సాధించాడు. ఈవారం ఎలిమినేషన్ తప్పించుకుంటే చాలు అతడు నేరుగా ఫైనల్స్ కి వెళ్ళి పోతాడు. నామినేషన్లు ఎలిమినేషన్ తో అతనికి ఎలాంటి సంబంధం ఉండదు.
ఇదంతా పక్కన పెడితే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంట్స్తెంట్ ఎవరో ప్రేక్షకులు ముందుగానే ఊహించారు. ఇక వారి ఊహలకు తగ్గట్టే సమాచారం కూడా బయటకు వచ్చింది. ఈవారం ఇంటి నుండి అవినాష్ ఎలిమినేట్ అవుతున్నాడని అంటున్నారు. ఇక ఆన్లైన్ పోల్స్‌లో కూడా అతనికి తక్కువ ఓట్లు పడటం గమనార్హం. అవినాష్ వచ్చిన మొదట్లో అందరినీ బాగా ఎంటర్టైన్ చేశాడు కానీ రాను రాను అతని పై విమర్శలు పెరిగిపోయాయి.
ఇక అందరూ తననే టార్గెట్ చేస్తున్నారు అని భ్రమలో బ్రకడం మాటిమాటికీ నన్ను అన్ని కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు నా దగ్గర విషయం లేకపోతే నేను ఈ స్టేజ్ కి రాను అని సొంత గొప్పలకు పోవడమే అతడిని భారీగా దెబ్బ తీశాయని అంటున్నారు. అది కాకుండా ఉన్నట్టుండి సీరియస్ కావడం అతనిలో చలాకీతనం తగ్గిపోవడం కూడా కొంత వరకూ అతడు బయటకు వెళ్లడానికి కారణం అయ్యాయి అని చెప్ప వచ్చు. టాస్కుల్లో రూల్స్ కి విరుద్ధంగా అన్ని ఈజీగా తనకు సానుకూలంగా జరగాలి అనుకోవడం కూడా అవినాష్ దగ్గర ఉన్న ఒక మైనస్ పాయింట్ అని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఇంటిలో మంచి ఎంటర్టైన్మెంట్ అందించిన అవినాష్ బయటికి వెళ్లిపోవడం హౌస్ కి లోటు అనే చెప్పాలి.