Bike offers: బైక్ కొనాలనుకుంటున్నారా.. ఆగండి, ఆగండి.. రూ.9 వేలకే కొత్త బైక్ వస్తోంది.. ఎలాగో చూడండి..

bike offers
Share

Bike offers: అప్పుడే కొత్త సంవత్సరం ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ కూడా వచ్చేసింది. ఈ శుభ దినాల్లో మంచి బైక్ కొనాలని అనుకోవడం సహజమే. కానీ ఈరోజుల్లో చక్కటి బైక్ కొనాలంటే కనీసం రూ.60 వేల కంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. దీనితో చాలామందికి బైక్ అనేది ఒక కలలాగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా బంపరాఫర్లు ప్రకటించాయి కంపెనీలు. అయితే తాజాగా ఒక కంపెనీ కేవలం రూ.9,000 వేలకి కొత్త బైక్ అందిస్తోంది. ఈ ఆకర్షణీయమైన ఆఫర్ పొందడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Bike offers: పండుగ వేళ అదిరిపోయే ఆఫర్లు

bike offers

పండుగ సందర్భంగా యమహా మోటార్ ఇండియా ఆకర్షణీయ ఫైనాన్స్ స్కీమ్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్స్ జనవరి 31 వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. యమహా ఫ్యాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రేజెడ్ఆర్ 124 ఎఫ్ఐ హైబ్రిడ్, రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్ఎస్ ఎఫ్ఐ, వైజెడ్ఎఫ్ ఆర్15 వీ3, వైజెడ్ఎఫ్ ఆర్15ఎస్ వీ3 వంటి వివిధ మోడల్స్ పై కస్టమర్లు ఆఫర్లు అందుకోవచ్చు.

రూ.9 వేలకే కొత్త బైక్

bike offers

150 సీసీ యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ మోడళ్లు అయిన ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ బైక్స్ పై యమహా కంపెనీ చాలా తక్కువ ధరకే డౌన్ పేమెంట్ ఫెసిలిటీ తీసుకొచ్చింది. దీంతో ఈ పండుగ వేళ మీరు కేవలం రూ.8,999 చెల్లించి కొత్త బైక్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. అయితే దీన్ని కొనుగోలు చేసుకునేందుకు డౌన్ పేమెంట్ ఆప్షన్ రూ.8999 లేదా 9.49 శాతం వడ్డీ రేటుతో రుణం పొందొచ్చు. 125 సీసీ హైబ్రిడ్ స్కూటర్ అయిన ప్యాసినో, రేజెడ్ఆర్, రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్లపై రూ.3 వేల వరకు క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. ఒకవేళ మీ దగ్గర రెడీగా మనీ లేకపోతే 7.99 శాతం వడ్డీ రేటుకు లోన్ కూడా పొంది బైక్స్ ఇంటికి తీసుకెళ్లవచ్చు. వైజెడ్ఎఫ్ ఆర్ 15 వీ3 (YZF-R15 V3S) వైజెడ్ఎఫ్ ఆర్15ఎస్ వీ3 (YZF-R15 V3S) అనే మోడల్స్ పై కూడా డౌన్ పేమెంట్ ఫెసిలిటీ అందిస్తోంది కంపెనీ. ఈ ప్రీమియం బైక్ కోసం మీరు రూ.19,999 చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. లేదా మీరు వడ్డీ రేటు 10.99% తో లోన్ తీసుకొని వెంటనే బైక్ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

అయితే ఈ ఆఫర్ ను ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి కాబట్టి కొనుగోలు చేసేముందు ఒక్కసారి కంపెనీని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటే మంచిది.

Electric Bikes : లేటెస్ట్ ఫీచర్స్ తో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ అదుర్స్..


Share

Related posts

జగన్ – ఆనం – ఆ సీనియర్ మంత్రి : కాన్ఫరెన్స్ కాల్ ?

sekhar

కొత్తరకం కరోనా కట్టడి విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!!

sekhar

Breaking : తూర్పు గోదావరి జిల్లా సర్పవరంలోని పరిశ్రమలో ప్రమాదం – ఇద్దరు మృతి

somaraju sharma