రక్షణ కోరిన బిందు,కనకదుర్గ


కేరళ, జనవరి 17: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకున్న బిందు, కనకదుర్గలు తమకు ప్రాణ హాని ఉందంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  వీరు ధాఖలు చేసిన పిల్‌ను  శుక్రవారం విచారించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
కేరళకు చెందిన బిందు, కనక దుర్గలు ఈనెల రెండున అయ్యప్ప ఆలయంలోకి వెళ్ళారు.
పదినుంచి 50 ఏళ్ళ లోపపు మహిళలకు శబరిమల ఆలయ దర్శనం నిరాకరించరాదని 2018 సెప్టెంబరు 28న సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తర్వాత వీరు పోలీస్ భద్రత మధ్య స్వామి దర్శనం చేసుకున్నారు.
మహిళల దర్శనం అనంతరం కేరళలో నిరసనలు జరిగాయి. అనంతరం వివిధ చోట్ల వీరిద్ధరూ రహస్యంగా గడిపారు.
ఈనెల 15న కనకదుర్గ ఇంటికి రాగానే ఆమె అత్త కర్రతో తలపై కొట్టడంతో గాయపడ్డారు. అమెను మలాప్పురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.  ఈమేరకు ఆమె పోలీసు కేసు నమోదు చేశారు.
న్యాయకళాశాల అధ్యాపకురాలైన బిందు తిరిగి తన విధుల్లో చేరారు. కోజికోడ్‌లో తాను వివక్ష  ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు.