ఇప్పుడు తాజాగా ఏపిలోని కర్నూలు జిల్లాలోనూ పెద్ద ఎత్తున కోళ్లు అనుమానాస్పదంగా మృతి చెందడం ఆందోళన కల్గిస్తుంది. కర్నూలు జిల్లా కొత్తపల్లె, పాములపాడు మండలాలలోని పలు ప్రాంతాల్లో వింత వ్యాధితో కోళ్లు, కాకులు చనిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోళ్లు చనిపోయిన తరువాత ముక్కలో నుండి ఒక రకమైన ద్రవం కారడం, కొన్ని కోళ్లకు చర్మంపై బొడిపెలుగా వచ్చి చర్మం రాలిపోవడం వంటివి జరుగుతున్నాయని బాదితులు తెలుపుతున్నారు. గురువారం కొత్తపల్లె మండలం సింగరాజుపల్లె గ్రామంలో సంజీవరాయుడుకు చెందిన 50 కోళ్లు మృతి చెందాయి. ఆదే గ్రామంలో అయిదు కాకులు కూడా మృతి చెందాయి. పాములపాడు చెందిన నబీరసూల్ అనే రైతు ఇంట్లో నాలుగు, కృష్ణానగర్ గ్రామంలో రామకోటినాయక్ అనే రైతు ఇంట్లో 70 కోళ్లు చనిపోయాయి. ఇదే పరిస్థితి పలు గ్రామాల్లో రైతుల ఇళ్లలో కొనసాగుతోంది. అయితే ఈ విషయం తమ దృష్టికి రాలేదని పాములపాడు పశువైద్యాధికారి భాస్కర్ తెలిపారు.
బర్డ్ ఫ్లూ వైరస్ పక్షుల నుండి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల్లో పౌల్ట్రీ యజమానులకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ బర్డ్ ఫ్లూ వైరస్ పక్షుల నుండి మనుషులకు వ్యాప్తి చెందిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు. అయితే ముందు జాగ్రత్త చర్యగా బల్డ్ ప్లూ విస్తరించిన పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు మాంసం విక్రయాలపై నిషేదాజ్ఞలు జారీ చేశాయి. బల్డ్ ఫ్లూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపిలో పశు సంవర్థక శాఖ వైద్యాధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…