NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌న్‌ను ఎందుకు బీజేపీ ఎర్రిప‌ప్ప చేసిందో తెలుసా?

pawan kalyan delhi tour importance

భార‌తీయ జ‌న‌తాపార్టీతో పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆ పార్టీ చుక్కలు చూపిస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తిరుపతి లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గానికి జరగబోయే ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన క‌లిసి పోటీ చేస్తున్నాయ‌ని పైకి క‌నిపించ‌డమే కానీ… బీజేపీ ఆదేశిస్తోంది….. ప‌వ‌న్ పాటిస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.

pawan kalyan delhi tour importance

బీజేపీ పెద్ద ప‌నిలోనే ఉందిగా

తిరుప‌తి ఉప ఎన్నిక‌ను బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దీనికి కార‌ణాలు కూడా ఉన్నాయి. 1999లో తిరుప‌తిలో బీజేపీ అభ్యర్ధి ఎంపీగా గెలిచారు. 2004లో రెండో స్థానం దక్కింది. కానీ.. తర్వాతి రోజుల్లో ఆ ఊపును నిలబెట్టుకోలేకపోయింది బీజేపీ. ఇప్పుడు రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని భావిస్తున్న కమలనాథులు తమ శ్రేణులను, శక్తులను తిరుపతిలో మోహరింప చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తిరుపతిలో స్పీడ్‌ పెంచిన బీజేపీ.. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్‌ స్థాయి నుంచి పక్కా వ్యూహం అమలు చేస్తోంది. 45 మండలాల బూత్‌ కమిటీల బాధ్యతలను దాదాపు 15 మంది రాష్ట్రస్థాయి నాయకులకు అప్పగించి క్షేత్రస్థాయిలో పట్టు బిగించాలని అనుకుంటోంది.

సోము వీర్రాజు దూకుడు

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక విష‌యంలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పదే పదే తిరుపతి లోక్‌సభ పరిధిలో పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జాతీయస్థాయి నాయకులను తిరుపతికి రప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర సహ ఇంఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌ బూత్‌ కమిటీలను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఎలా పాగా వేయాలో చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలనే తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు చత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌తోపాటు, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్‌, కేంద్రమంత్రి మురళీధరన్‌ హాజరయ్యారు.

ఇందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ లైట్ తీసుకున్నారా?

తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థే బ‌రిలో ఉంటార‌ని అధికారిక ప్ర‌క‌ట‌నే మిగిలింద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. దీనికి కార‌ణం సైతం ఉంది. కిందటి ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ సీటులో జనసేన పోటీ చేయకుండా BSPకి మద్దతు ఇచ్చింది. 20వేల ఓట్లే వచ్చాయి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ త‌మ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌డం ఖాయ‌మ‌ని చెప్తున్నారు.

author avatar
sridhar

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju