NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

BJP : ఇండియానే కాదు ఇరుగు పొరుగు దేశాలలో కూడా బిజెపి విస్తరణ!ఇదే జరిగితే అదో వండర్!

5 States Elections Results: Did BJP Lost or Gain Their Votes..?

BJP : బీజేపీ లీడ‌ర్, త్రిపుర ముఖ్య‌మంత్రి బిప్ల‌వ్ దేవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తమ పార్టీని నేపాల్, శ్రీలంక‌లో కూడా విస్త‌రించాలనే యోచ‌న‌లో అధిష్టానం ఉంద‌‌ని అన్నారు. అగ‌ర్త‌ల‌లో బీజేపీ నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. త‌మ పార్టీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను గెలిచిన తరువాత.. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక ల‌లో కూడా  ఏర్పాటు చేసే ఆలోచన ఉంద‌ని, అందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద ప్రణాళికలు ఉన్నాయ‌ని అన్నారు.

 BJP expansion not only in India but also in neighboring countries!
BJP expansion not only in India but also in neighboring countries!

ఈ విష‌యాన్ని గ‌తంలో అమిత్ షా రాష్ట్ర‌ బీజేపీ ఈశాన్య మండల కార్యదర్శి అజయ్ జామ్వాల్ తో ప్ర‌స్తావించార‌ని ఆనాటి సంగ‌తిని గుర్తు చేశారు.శ్రీలంక, నేపాల్ దేశాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయని, పార్టీని అక్కడ కూడా విస్తరించి.. ఆ దేశాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల‌ని ఆనాడు షా అన్నారంటూ విప్లవ్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో, త్వరలో జరగనున్న పశ్చిమబెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు. ప‌శ్చిమ బెంగాల్ ప్రజలు త్వరలో టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీకి వీడ్కోలు పలుకుతారని, తమిళనాడుతో సహా దేశవ్యాప్తంగా “క‌మ‌లం వికసిస్తుంది” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

BJP : పశ్చిమబెంగాల్ ముమ్మాటికీ మాదే!

పశ్చిమ బెంగాల్‌‌లో ఈ యేడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఢంకా మోగిస్తామని ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ అన్నారు. బీజేపీ దూకుడుకు తృణమూల్ కాంగ్రెస్ భయపడుతోందని, ఆ భయమే తమను గెలిపిస్తుందన్నారు. అధికార తృణమూల్‌కు తాము నెగ్గలేమని అర్థమైందన్నారు. బెంగాల్‌‌లో మార్పు రాబోతోందని, ఇది నిజమన్నారు. బెంగాల్ ప్రజలు తమకు మమతా బెనర్జీ అక్కర్లేదని భావిస్తున్నారని, వారికి కావాల్సింది బీజేపీనని స్పష్టం చేశారు.

మోడీని గోబ్యాక్ అన్నందుకు నటిపై కేసు!

తమిళనాడుకు చెందిన నటిపై స్థానిక బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని మోదీపై ఆమె అనుచితంగా ట్వీట్ చేసిందంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం చెన్నై పర్యటనకు ప్రధాని వెళ్లిన విషయం తెలిసిందే. అయితే మోదీ పర్యటనకు ఒక రోజు ముందు నటి ఓవియా హెలెన్ ప్రధానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ‘గో బ్యాక్ మోదీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో అంటూ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి బీజేపీ నేతలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓవియా ట్వీట్‌తో అనేకమంది శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించారని, అంతేకాకుండా ఆమె తన ట్వీట్ ద్వారా దేశ ప్రధానిని కించపరిచారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఓవియా తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొన్నారు. అలాగే తమిళ మళయాళ, తెలుగు చిత్రాల్లో కూడా నటించారు.

 

author avatar
Yandamuri

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju