NewsOrbit
న్యూస్

ఇన్నాళ్లూ దాక్కుని దాక్కుని డ్రామా… రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బీజేపీ!

ఏపీలో ఒక బీజేపీ, కేంద్రంలో ఒక బీజేపీ అని రెండు బీజేపీలు లేవు.. భారతదేశం మొత్తం ఉన్నది ఒకటే భారతీయ జనతా పార్టీ అని లంకా దినకర్ లాంటి ఏపీ బీజేపీ నేతలు పైకి ఎంతగా ప్రజలను నమ్మించే పనికి పూనుకున్నా… అది వేరు ఇది వేరని… లేదు రెండూ ఒకటే అంటే… వాటికున్న నాలుకలు అయినా రెండు ఉండి ఉండాలి అని ఫిక్సయిపోతున్నారు ఏపీ వాసులు! రాజధాని విషయంలో వారు అనుసరిస్తోన్న ద్వంద్వ వైఖరే దీనికి కారణం!

మూడు రాజధానుల బిల్లుకి సంబంధించి కన్నా లక్ష్మినారాయణ.. గవర్నర్‌కి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, కన్నా లక్ష్మినారాయణ ఈ లేఖను తనకుతాను చెబుతున్న అభిప్రాయంగా కాకుండా.. పార్టీ అధ్యక్షుడి హోదాలో రాయడంతో బీజేపీలో ముసలం పుట్టిస్తోందట. “అధిష్టానానికి చెప్పకుండా కన్నా లక్ష్మినారాయణ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు..” అంటూ బీజేపీకే చెందిన ఓ ఢిల్లీ స్థాయి నాయకుడు అసహనం వ్యక్తం చేస్తున్నారట. దానికి కారణం… ఏపీ 3 రాజధానుల విషయంలో ఆ నేత వేరే అభిప్రాయాన్ని చెప్పడం!

ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పే ఒక సీనియర్ నేత… రాజధాని కి సంబందించిన విషయం పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని.. అందులో కేంద్రం జోక్యం చేసుకోదని క్లారిటీ ఇచ్చారు! జాతీయ స్థాయి నేతలు అలా చెప్పిన క్రమంలో.. కన్నా ఇలా సొంతపెత్తనం చేయడం సరైన చర్య కాదంటూ… సదరు సీనియర్.. హస్తినలో కన్నాపై ఫిర్యాదు కూడా చేశారంట. అయితే అది వాళ్ల ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి… అసలు రాజధాని విషయంలో బీజేపీ రెండు నాలుకల సిద్ధాంతాన్ని పునికిపుచ్చుకుందని భావించాలేమో అనేది ఇప్పుడు ఏపీ వాసుల మాటగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఇంతకూ ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై స్థానికంగా గుంటూరు జిల్లా నేతగా కన్నా స్పందించారా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా స్పందించారా.. ఢిల్లీలో స్పందించిన సీనియర్ బీజేపీ నేతతో ఈయనకున్న విభేధాల వల్ల అలా స్పందించారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ… రెండు నాలుకల దోరణి మాత్రం ప్రస్తుతానికి కన్ ఫాం అంటున్నారు విశ్లేషకులు!

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju