NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు, పవన్ ముందు బీజేపీ గొంతెమ్మ కోరికలు.. దిమ్మ తిరిగేలా..!

నేడు ఢిల్లీలో కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ రాజ‌కీయాల‌పై న‌ర్మ‌గ‌ర్భంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన బీజేపీ నాయ‌కులు.. తాజాగా బుధ‌వారం రాత్రికి ఏ స‌మ‌యానికైనా ఒక నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో వారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే ఆస‌క్తిగా మారింది. ఇక‌, బీజేపీతో జ‌రిగే పొత్తు చ‌ర్చ‌ల కోసం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలుత వెళ్ల‌నున్నారు. ఈయ‌న బుధ‌వారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు.

ఇక‌, ఇదేస‌మ‌యంలో బీజేపీరాష్ట్ర చీఫ్ పురందేశ్వ‌రి కూడా.. ఢిల్లీ బాట ప‌ట్టారు. ఈమె స‌మ‌క్షంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర మంత్రి, అగ్ర‌నేత అమిత్‌షా ప‌వ‌న్‌తో చ‌ర్చలు చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిసింది. దీంతో ఆమె ను ముందు పెట్టి ఏపీ వ్య‌వ‌హారాల‌ను తేల్చేస్తార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఉన్న ఏపీ బీజేపీనేత‌ల డిమాండ్ల‌ను, కేంద్రంలోని బీజేపీ నాయ‌కులు ఏం ఆశిస్తున్నారు? అనే విష‌యాల‌ను తేల్చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం బ‌ట్టి.. అసెంబ్లీ స్థానాల్లో 25 క‌నీసంగా కోరుతున్నారు. అదేస‌మ‌యంలో 30 వ‌ర‌కు ప‌ట్టుబ‌ట్ట వ‌చ్చ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఇప్పుడు మేం పుంజుకున్నాం. మాకు 30కి త‌గ్గ‌కుండా సీట్లు అడ‌గాల‌ని అనుకుంటున్నాం అని బీజేపీ కీల‌క నాయ‌కుడు, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేఒక‌రు రెండు రోజుల కింద వ్యాఖ్యానించారు. ఈ ఫార్ములానే.. కేంద్ర బీజేపీ నాయ‌కులు కూడా ప‌వ‌న్ ముందు పెట్టే అవ‌కాశం ఉంది.

ఇక‌, పార్ల‌మెంటు స్థానాల‌కు వ‌చ్చేస‌రికి క‌నీసంలో క‌నీసం.. 8 నుంచి 10 చోట్ల పోటీ చేసేందుకు .. బీజేపీ రెడీ అయిన‌ట్టు స‌మాచారం. దీనికి కూడా ఈ స‌మావేశంలో స్ప‌ష్టత రానుంది. అందుకే.. చంద్ర‌బాబు సైతం.. త్యాగాల‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించేశారు. వ‌చ్చేఎన్నిక‌ల్లో తాను, అవ‌స‌ర‌మైతే..ప‌వ‌న్ కూడా త్యాగాలు చేస్తామ‌ని తాజాగా ఆయ‌న వెల్ల‌డించారు. దీనిని బ‌ట్టి బీజేపీ భారీగానే సీట్లు కోరే అవ‌కాశం అవికూడా.. మిత్ర‌ప‌క్షాల‌కు బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు అడిగే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా..పురందేశ్వ‌రి, ప‌వ‌న్‌ల‌ను ఎదురెదురుగా పెట్టి తేల్చేయ‌డం ఖాయ‌మ‌ని ఢిల్లీ వ‌ర్గాలు సైతం చెబుతున్నాయి.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju