టీడీపీ విషయంలో సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసిన బీజేపీ..??

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నేపథ్యంలో బిజెపి పార్టీ మంచి దూకుడు మీద ఉన్న సంగతి తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని ఓడించడంతో గ్రేటర్ మేయర్ పిటాన్ని కూడా కైవసం చేసుకోవడానికి బిజెపి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలలో గెలవడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.

Vote anyone but BJP: TDP tells Telugu people in Karnataka - Oneindia Newsపూర్తి విషయంలోకి వెళ్తే గ్రేటర్ పరిధిలో బాగా పలుకుబడి క్షేత్రస్థాయిలో కాస్త పట్టు ఉన్న టిడిపి నేతలపై తెలంగాణ బిజెపి ఎక్కువ ఫోకస్ చేసినట్లు సరికొత్త టాక్ వస్తోంది. మేటర్ లోకి వెళ్తే దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయినా మల్కాజిగిరి పరిధిలో ఉండే టీడీపీ నేతలకు బిజెపి నేతలు ఎర వేస్తున్నట్లు తెలుస్తుంది.

 

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పై ఎక్కువగా టీడీపీ నేతలకు పట్టు ఉండటంతో తెలంగాణ బిజెపి ఈ వ్యూహాన్ని సరికొత్తగా అమలు చేస్తున్నట్లు తెలంగాణ రాజకీయవర్గాలలో టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి పరిధిలో ఉండే టిడిపి నేతలతో బిజెపి పార్టీకి చెందిన కీలక నాయకులు చర్చలు జరుపుతున్నట్లు భారీ ఎత్తున వారిని బీజేపీలోకి ఆహ్వానించ బోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క టిఆర్ఎస్ పార్టీ కూడా ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉన్న నేతలను కొంతమందిని తన పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా క్షేత్రస్థాయిలో రాణించాలంటే కచ్చితంగా ప్రాంతాలవారీగా మంచి పట్టు ఉన్న నేతలను పార్టీలో జాయిన్ చేసుకుంటే గ్రేటర్ ఎన్నికల్లో సులువుగా రాణించవచ్చు అనే టార్గెట్ తో తెలంగాణ ప్రధాన పార్టీలు మల్కాజిగిరి పై గట్టిగా ఫోకస్ పెట్టాయి.