NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Janasena: ఢిల్లీ నుండి చంద్రబాబు, పవన్ లకు పిలుపు .. బీజేపీ నేతలతో కీలక భేటీ

TDP Janasena: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ నుండి పిలుపు వచ్చిందని ఆయా పార్టీలు నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత పొత్తులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. శుక్రవారానికి పొత్తులపై పూర్తి స్పష్టత వస్తుందని వారు తెలిపారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత వైసీపీ వణికిపోతుందని అచ్చెన్నాయుడు అన్నారు.  ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ను ప్రకటిస్తామని తెలిపారు.

ఈ బహిరంగ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీడీపీ, జనసేన నేతలపై పోలీసుల వేధింపులు మానుకోవాలని కోరారు. వారి తీరు మారకుంటే న్యాయపరంగా ముందుకు వెళతామని చెప్పారు. ఆ వేధింపుల నుండి పార్టీ శ్రేణులను కాపాడేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 73062 99999 ను ఏర్పాటు చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చిలకలూరిపేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి కలిసికట్టుగా విజయవంతం చేస్తామని తెలిపారు. సభలో అభివృద్ధి ప్రణాళిక ను ప్రకటిస్తామని తెలిపారు. బుధవారం రాత్రి జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడటం దుర్మార్ఘమని అన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు మంచిది కాదని అన్నారు. ప్రతిపక్షాలపై కక్షసాధింపులకు పోలీసు యంత్రాగాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. అప్రజాస్వామిక చర్యలపై ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.

Pawan Kalyan: జగన్ గుంపు నుండి సీమను రక్షించుకోవాలి – పవన్ కళ్యాణ్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N