NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

సుశాంత్ కేసులో రియా అరెస్టుకి.., బీహార్ ఎన్నికలకు.. బీజేపీకి ఇదే కీలక లింకు..!!

బీజేపీ ఏం చేసినా అందులో అనేక లక్ష్యాలు, లక్షణాలు ఉంటాయి..! అందులో కొంత అమానవీయత, కొంత నీచ సంస్కృతి.., ఇంకొంత కుటిలం కూడా ఉంటాయి..! బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుని బీజేపీ బీహార్ ఎన్నికల్లో లబ్ది కోసం ఎలా మలుచుకుందో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు..!!

ముందుగా ఒకటి ఆలోచిద్దాం..!! సుశాంత్ ఆత్మహత్య చేసుకుని అయిదు నెలలు గడుస్తున్నా… ఇప్పటికీ జాతీయ మీడియాలో లైవ్ డిబేట్లు వస్తున్నాయి.., కరోనా విజృంభిస్తున్నా.., మరణాలు పెరుగుతున్నా దాన్ని కాదని చాలా జాతీయ ఛానెళ్లలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఇదే చర్చ నడుస్తుంది. అకారణంగా రియాని అరెస్టు చేయడం..! ఇవన్నీ బీజేపీ ఎత్తులే.., ఈ కేసులో బీజేపీ ఎక్కడ, ఎలా, ఎందుకు తనకు అనుకూలంగా మార్చుకుందో చూద్దాం..!
ఈ కేసు ఏమిటి..? బాలీవుడ్ హీరో ఆత్మహత్య..! సీబీఐ విచారణ ఎలా చేసింది..? డ్రగ్స్ కేసుగా మళ్లించింది.. రియా చక్రవర్తిని అరెస్టు చేసింది..! బీహార్ లో త్వరలో ఎన్నికలు ఉండడంతో బీహారీ అయినా సుశాంత్ కేసుని బీజేపీ తన ఎన్నికల అస్త్రంగా మలుచుకుంది..!!

సీబీఐ ఎక్కడ, ఎలా లాజిక్ మిస్ అయింది..!?

డ్రగ్స్ తీసుకోకూడదు. అది ముమ్మాటికీ తప్పే. అలా అని డ్రగ్స్ తీసుకునే వాళ్ళని జైల్లో పెట్టేయాలి అంటే దేశంలో జైళ్లు సరిపోవు. సుశాంత్ కేవలం డ్రగ్స్ తీసుకోవడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నారా..? కాదు కదా..? అతను డిప్రెషన్ లోకి వెళ్లి, మనసు ముక్కలై, మైండ్ చెదిరి ఆత్మహత్య చేసుకున్నారు..! కానీ సీబీఐ ఏం చేసింది..? సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వలనే సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు అయ్యాయని, ఆమె సప్లై చేసిందని.. అందుకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని ఓ లాజిక్ లేని కేసు నమోదు చేసి రియాని అరెస్టు చేసింది. చివరికి ఈ కేసు నిలబడ లేదు. అందుకే రియాని విడుదల చేసేసారు. కానీ సీబీఐ తప్పుల ముంగిట బీజేపీ పాత్ర, వ్యూహం.., ఎన్నికల చీకటి తతంగం చెప్పుకోవాల్సిందే..!!

బీహారీలకు మహారాష్ట్రీయులు అంటే మంట..!!

అతి త్వరలోనే బీహార్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అక్కడ పాతుకుపోయిన నితీష్ కుమార్, లాలూ లను కాదని.. సొంత పునాదులపై నిలబడాలి అనేది బీజేపీ గట్టి ఆశయం. అందుకే బీహారీల ఓట్లు గెలుచుకోవాలి. వారి మనస్సులో బీజేపీ గ్రేట్ అనిపించుకోవాలి. అందుకే బీహారీలకు స్వతహాగానే శత్రువులుగా ఉండే మహారాష్ట్రీయులను ఇబ్బంది పెట్టింది. బీహారీయుడైన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మహారాష్ట్రీ అయిన రియాని అరెస్టు చేశారు. నిజానికి ఈ కేసులో మహా సీఎం కొడుకుపైనా కన్నేశారు. కానీ సరైన ఆధారాలు, లాజిక్కులు దొరకలేదని వదిలేశారు. రియా తండ్రి ఒక కల్నల్. సైన్యంలో చాలా కాలం సేవ చేశారు. కుమార్తె అరెస్టుతో ఆయన బాగా కుంగిపోయారు. “దేశానికి సేవ చేసినందుకు నాకు ఇచ్చిన బహుమతి ఇదే” అంటూ ఆవేదన చెందారు. మరోవైపు సుశాంత్ డ్రగ్స్ కి బానిసగా మారి, డిప్రెషన్ లో ఉన్న సమయంలో రియానే అతనికి తోడుగా నిలిచింది..! కానీ ఆమెని సీబీఐ బలిచేయాలని చూసింది..! ఇదీ సంగతి ఓ హీరో ఆత్మహత్య కేసుని డ్రగ్స్ కి లింకు పెట్టి, మహారాష్ట్రీయుడైన సైనికుడి కుమార్తెని అరెస్టు చేసి, బీహారీల ప్రేమను గెలుచుకునే బీజేపీ వ్యూహం మొదట్లోనే బెడిసికొట్టింది. బీజేపీ అసలు రంగు ఇదేనా.. కాషాయం మాటున ఇంత కుతంత్రాలు ఉంటాయా అనేలా చేసింది..!!

 

 

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!