NewsOrbit
న్యూస్

‘తిరుపతి ‘కొండకు దారం వేసి లాగాలని చూస్తున్న బీజేపీ!పవర్ స్టార్ పరపతిపై ఎన్నెన్నో ఆశలు!!

తెలంగాణాలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలవడంతో ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న తిరుపతి లోక్సభ ఉపఎన్నికలోనూ తమ సత్తా చాటాలని రాష్ట్ర బిజెపి ఉబలాటపడుతోంది. అయితే ఆ పార్టీకి అంత ఊపుఉందా అన్నదే అనుమానాస్పదం.

మొన్నటి ఎన్నికల్లో తిరుపతిలో గెలిచిన వైసీపీ అభ్యర్థి బలి దుర్గాప్రసాదరావు ఇటీవల కరోనాతోమృతి చెందగా త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది.ఏపీలో కొత్తగా జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం కొలువుదీరాక జరగబోయే తొలి ఉప ఎన్నిక కూడా ఇదే.ఎలాగూ వైసిపి అధికారంలో ఉంది కాబట్టి ఆ ఉప ఎన్నికను సీరియస్గానే తీసుకుంటుంది.సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవటానికి ప్రభుత్వ పరమైన ప్రయత్నాలు జరుగుతాయి.ఇక రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తన వంతుగా తాను పోటీ పడుతుంది.అయితే 2019 ఎన్నికల్లో కేవలం పదహారు వేల ఓట్లను తిరుపతి లోక్సభ స్థానంలో సాధించిన బీజేపీ ఏకంగా ఇప్పుడు ఈ స్థానాన్ని ఉప ఎన్నికలో కైవసం చేసుకుంటామన్న రీతిలో బిల్డప్ ఇస్తుండటమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

1999 లో ఒక్కసారి టిడిపితో పొత్తు ఉన్న నేపధ్యంలో బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి తిరుపతి లోక్సభ స్థానంలో పదమూడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.2014లో మళ్లీ టిడిపి -బిజెపి కలిసికట్టుగా పోటీ చేయగా అదే లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరామ్ నలభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.ఈ ఎన్నికల మినహాయిస్తే ఈ రెండు ఎన్నికలు మినహాయిస్తే బిజెపి ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆ పార్టీ అభ్యర్థుల ఓట్లు ఈ లోక్సభ నియోజకవర్గంలో పాతికవేలు దాటలేదు.అదే తిరుపతిలో బిజెపికున్న పరపతి.ఈ పరిస్థితుల్లో అక్కడ గెలిచేస్తామని ఆ పార్టీ ఎలా చెబుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు.బహుశా తన మిత్రుడైన జనసేనాని పవన్ కల్యాణ్ కు తిరుపతిలో ఉన్న పాపులారిటీ ఆధారంగా బీజేపీకి ఓట్ల వర్షం కురుస్తుందని కమలనాథులు కలలు కంటున్నట్లు కనిపిస్తోంది .

మొన్నటి ఎన్నికల్లో తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో జనసేన తన అభ్యర్థిని నిలబెట్టలేదు. జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థికి ఇరవై వేల ఓట్లు వచ్చాయి.అటు బీజేపీకి , ఇటు బీఎస్పీకి విడివిడిగా వచ్చిన ఓట్లకంటే నోటాకే అధికంగా ఇరవై అయిదు వేల ఓట్లు వచ్చాయి.కాబట్టి ఉప ఎన్నికలో ఏదో ఇరగదీసేస్తామని బీజేపీ అనుకోవడం తిరుపతి కొండకు దారం కత్తి లాగడమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.బీజేపీ జనసేన కలిసి పోటీ కలిసినా కూడా అక్కడ నెగ్గుకురాలేరు అంటున్నారు.దుబ్బాక తిరుపతికి చాలా తేడా ఉందని..పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా బీజేపీ వ్యవహరిస్తే దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు.

 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!